నిజామాబాద్

పంట దిగుబడులు పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, ఆగస్టు 14: రైతులకు పురుగుల నివారణ చర్యలపై అవగాహన కల్గించి, పండగ దిగుబడికి సరైన సలహాలు అందిచాల్సిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎన్. సత్యనారాయణ వ్యవసాయ శాఖ అధికారులను, రైతు సమన్వయ సమితీ కన్వీనర్‌లను కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పద్మాశాలీ భవన్‌లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్లకు, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులకు, మండల వ్యవసాయ శాఖ అధికారులకు పత్తిపంటపై సస్యరక్షణ చర్యలు అవలంభించాల్సిన పద్దతులపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏరవాకేంద్రం సైంటిస్టులతో అవగాహన సదుస్సు నిర్వించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 43 వేల ఎకరాల్లో పత్తి, 53 వేల ఎకరల్లో మొక్కజొన్న పంట సాగువుతుందని అన్నారు. రైతులందరికి పంటపై పురుగులు ఆశించకుండా, ఆశిస్తే నివారణ చర్యల గురించి సకాలంలో వివరించి చేపట్టాల్సిన చర్యలు వివరించాలని అన్నారు. అధిగ దిగుబడులు పొందే విషయాలపై అవగాహన కల్గించాలని, వ్యవసాయ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని, క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలన జరపాలని అన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అందిస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలను వివరాలను అర్థం అయ్యేలా సూచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ అంజీరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ నాగేంద్రయ్య, సైంటిస్టు నవీన్‌కుమార్ పాల్గొన్నారు.