నిజామాబాద్

‘కంటి వెలుగు’కు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 14: కంటి జబ్బుల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు తెలిపారు. బుధవారం నుండి కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో, కలెక్టర్ మంగళవారం తన చాంబర్‌లో అధికారులతో తుది ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఒక్కో గ్రామంలో ప్రతిరోజు 250 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారని, ఇలా చివరి వ్యక్తికి కూడా పరీక్షలు నిర్వహించడం పూర్తయిన తరువాతే వైద్య బృందం మరో గ్రామానికి వెళ్తుందని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 15.66 లక్షల మంది జనాభా ఉన్నారని, వారిలో గ్రామీణ ప్రాంతాల్లో 11.18లక్షల మంది, పట్టణ ప్రాంతాల్లో 4.48 లక్షల మంది ఉండగా, అందరికీ నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేయడం, శస్త్ర చికిత్సలు జరిపించేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 39 బృందాలు నియమించామని, ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 25 బృందాలు, పట్టణ ప్రాంతాల్లో 10 బృందాలు వైద్య పరీక్షలు నిర్వహిస్తాయని తెలిపారు. మరో నాలుగు బృందాలను కూడా ప్రత్యేకంగా అందుబాటులో ఉంచామన్నారు. ఒక్కో బృందంలో మెడికల్ ఆఫీసర్, నేత్ర వైద్య నిపుణులు, సూపర్‌వైజర్, ముగ్గురు మేల్ హెల్త్ వర్కర్లు, నలుగురు ఆశా వర్కర్లు, ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లు కలుపుకుని మొత్తం 13 మంది ఉంటారని అన్నారు. నేత్ర పరీక్షలు నిర్వహించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో 518 ప్రదేశాలను, పట్టణాల్లో 109 ప్రాంతాలను గుర్తించామని వివరించారు. కంటి శిబిరం వద్ద ఐదు కౌంటర్లు ఉంటాయని, మొదటి కౌంటర్లో పేర్ల నమోదుతో ప్రక్రియ ప్రారంభం అవుతుందని, అనంతరం ఒక్కో కౌంటర్ వారీగా కంటి పీక్షలతో పాటు బీ.పీ, సుగర్ పరీక్షలు కూడా నిర్వహిస్తారని అన్నారు. చూపు మందగించిన వారికి అక్కడికక్కడే కంటి అద్దాలు ఉచితంగా అందజేస్తారని, శస్త్ర చికిత్సలు నిర్వహించాల్సిన వారిని గుర్తించి జిల్లా కేంద్రంలో ప్రముఖ వైద్యశాలలో ఉచితంగా కంటి ఆపరేషన్ చేసిన మీదట అద్దాలు కూడా ఉచితంగా పంపిణీ చేస్తారని సూచించారు. కంటిచూపు సమస్యలతో బాధపడే ఎంతోమందికి మేలు చేసే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా ప్రజాప్రతినిధులు, అధికారులు తోడ్పాటును అందించాలని కలెక్టర్ కోరారు.
నేడు ముదక్‌పల్లిలో లాంఛనంగా ప్రారంభం
కంటి వెలుగు కార్యక్రమాన్ని మోపాల్ మండలం ముదక్‌పల్లిలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అదేవిధంగా బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్‌ఆమిర్ రాకాసిపేటలో, పాన్‌గల్లిలో, మిషన్ భగీరథ వైస్ చైర్మెన్ ప్రశాంత్‌రెడ్డి మోర్తాడ్‌లో, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మిర్జాపల్లిలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్‌గుప్తా జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.