నిజామాబాద్

ఆర్మూర్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, సెప్టెంబర్ 17: రానున్న ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆకుల లలిత స్పష్టం చేశారు. సోమవారం నందిపేట మండల కేంద్రంలోని పలుగుగుట్టపై గల శివాలయం, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, బాలయోగి రాములురాజ్‌కు ఎమ్మెల్సీ ఆకుల లలితరాఘవేందర్ దంపతులు పాదపూజ చేశారు. అంతకు ముందు ఆకుల లలితకు ఆర్మూర్ టికెట్‌ను ఖరారు చేసినట్లు తెలియడంతో 3వేల మోటార్ సైకిళ్లతో దాస్‌నగర్ నుండి కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు భారీ ర్యాలీతో ఆమెకు పలుగుగుట్ట వరకు స్వాగతం పలికారు. నందిపేట, మాక్లూర్, ఆర్మూర్ మండలాలకు చెందిన సుమారు 5వేలమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్సీ నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకుల లలిత మాట్లాడుతూ, తనకు ఆర్మూర్ టికెట్ రాదని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారని, అలాంటి అపోహలు నమ్మవద్దన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు రెండు రోజుల క్రితం తనకు ఢిల్లీలో కండువా వేసి ఆర్మూర్ టికెట్ కేటాయిస్తున్నట్లు వెల్లడించారని స్పష్టం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో, ఐక్యతతో ఎమ్మెల్యే స్థానాన్ని గెలిపించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు తనను గెలిపించారని, ప్రస్తుతం కూడా ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ ఆధ్వర్యంలో వెల్మల్ గ్రామానికి చెందిన రజక సంఘం సభ్యులు, గొట్టుముక్కుల, బొంకన్‌పల్లి గ్రామాలకు చెందిన 300మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కంచెట్టి గంగాధర్, పీసీ భోజన్న, వెంకుల్, సాయారెడ్డి, పెంట ఇంద్రుడు, సుబ్బం ముత్యం, సాయికృష్ణారెడ్డి పాల్గొన్నారు.