నిజామాబాద్

పర్యావరణాన్ని పరిరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి టౌన్, జనవరి 2: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పిప్పిరి సుష్మ అన్నారు. శనివారం బల్దియా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 2వ తేదీ నుండి కామారెడ్డి పట్టణంలో అన్ని వ్యాపార సంస్థల వారు స్వచ్ఛందంగా పాలథీన్ కవర్లను వాడమని ముందుకు రావడం అభినందనీయమన్నారు. జిల్లాలోనే కామారెడ్డిలో పాలథీన్ కవర్లు జనవరి మాసంలో అన్ని దుకాణాల వారు పూర్తిగా వాడకుండా జిల్లాలోనే ఆదర్శంగా నిలవాలని కోరారు. పాలథీన్ కవర్లతో అనేక రకాల జబ్బులు ప్రజలకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా పాల్తీన్ కవర్ల వాడకం వల్ల జరిగే నష్టాలను కమిషనర్ పట్ట్భా వ్యాపారులకు వివరించారు. ఈ సమావేశంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ మసూద్, కౌన్సిలర్లు పద్మ, జ్యోతి, జొన్నాల నర్సింలు, మోహన్, రాంమోహన్, వ్యాపార సంఘాల ప్రతినిధులు యెల్లంకి శ్రీను, భగవాన్, రాజు, తదితరులున్నారు.

ఆపరేషన్ స్మైల్ ప్రారంభం
బాలకార్మిక రహిత జిల్లాగా ఇందూరు

సుభాష్‌నగర్, జనవరి 2: బాల కార్మికులను పని నుండి విముక్తి కల్పించి వారి ముఖాల్లో చిరునవ్వులు చిందించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బాలల సంరక్షణ సమితి చైర్మన్ తారాచంద్ వెల్లడించారు. జిల్లాలోని నాలుగు సబ్ డివిజన్‌ల పరిధిలో ఈ నెల 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాల సంరక్షణ సమితి కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గంజ్ ప్రాంతంలోని పలు దుకాణాల్లో పని చేస్తున్న బాల కార్మికులను అధికారులు గుర్తించి వారికి పనుల నుండి విముక్తి కల్పించారు. బాల కార్మికులను ఎవరైనా పనుల్లో పెట్టుకుంటే సంబంధిత యజమానులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, 20వేల రూపాయల జరిమానా, మూడు నెలల జైలు శిక్ష తప్పదని తారాచంద్ హెచ్చరించారు. బాల కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు చేయడంతో పాటు, జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాలల సంరక్షణ శాఖతో పాటు పోలీసు, రెవెన్యూ, కార్మిక, వైద్య, విద్యా శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఆపరేషన్ స్మైల్‌లో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా ఇటుక బట్టీలు, బేకరీలు, పలు దుకాణాలు, ట్రేడర్స్, హోటళ్ల వద్ద అనుక్షణం నిఘా కొనసాగుతుందని, నిఘా నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ ప్రతినిధి నాగెల్లి బాబు, కమిటీ సభ్యుడు ఎస్‌ఐ వెంకట్, పోలీసు, ఐసిడిఎస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.