నిజామాబాద్

నలభై ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చూపించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, సెప్టెంబర్ 17: నలభై ఏళ్లలో జరుగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించామని ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం బోధన్‌లో జరిగిన తెరాస బూత్ కమిటీల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గత పాలకులు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని కానీ తెరాస అధికారంలోనికి వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఏమిటో చేతలలో చూపించామన్నారు. ప్రగతి చక్రాలు ఆగవద్దన్న ఉద్దేశంతోనే ముందస్తు ఎన్నికలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. తెరాస సర్కారు అవలంభించిన ప్రజా సంక్షేమ పథకాలు, సాధించిన అభివృద్ధి పనుల వలన ప్రజలు మరోమారు తెరాసకు పట్టం కట్టెంట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర అద్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేయించిన సర్వేలో కూడా తెరాస అధికారంలోనికి రానుందని తేలిందన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకిరణాలు ఆపడం ఎవ్వరి తరం కాదని అలాగే తెరాస విజయాన్ని కూడా ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదన్నారు. రైతులకు 24 గంటలు విద్యుత్‌ను అందించిన ఘంత కెసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాబోయే జూన్ నాటికి నిజాంసాగర్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిండి రెండు పంటలకు పుష్కలంగా నీటిని అందిస్తామన్నారు. రైతు పంటకు అవసరమైన పెట్టుబడిని అందించి రైతును అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత తెరాసదేనన్నారు. అలాగే రైతు భీమాకు సంబంధించిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించి రైతును అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. 1098 మంది రైతులు చనిపోతే అందులో 900 మంది రైతులకు 45 కోట్ల రూపాయలను రైతు భీమా ద్వారా అందించామన్నారు. తెరాస పాలనను అన్ని వర్గాలు సమర్థిస్తున్నాయని కావున జరుగబోయే ఎన్నికలలో ఇక్కడ తెరాస అధికారంలోనికి రావడం ఖాయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ పై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగిందన్నారు. బంగారు తెలంగాణ సాధించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో వంద సీట్లలో తెరాస గెలుపు ఖాయమని అలాగే జిల్లాలో కూడా 9 స్థానాలలో తెరాస అభ్యర్థులే విజయం సాధిస్తారని అన్నారు. కుంభకోణాలు, అవినీతి పరులకు జరుగబోయే ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఎన్ని రకాల అవరోధాలు వచ్చినా అభివృద్ధి విషయంలో రాజీకి తావులేకుండా వ్యవహరించామని కావున మరోమారు రాష్ట్రంలో తెరాసకు పట్టం కట్టేందుకు ప్రజలు
సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు షకీల్ అహ్మద్, జిల్లా సహకార బ్యాంకు అద్యక్షుడు గంగాధర్‌రావ్, తెరాస నాయకులు మోహన్‌రెడ్డి, బుద్దె రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, శివాలయం కమిటీ చైర్మన్ పాలవార్ సాయినాథ్, గుమ్ముల అశోక్‌రెడ్డి, నాయకులు దేశాయ్, రజాక్, శరత్‌రెడ్డి, శ్యాంరావ్, సంజీవ్‌కుమార్, ఆబిద్ సోఫి, రజిత ఎల్లయ్య యాదవ్, సునీత దేశాయ్, ఎత్తేశ్యాం, నర్సింగ్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.