క్రైమ్/లీగల్

ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, అక్టోబర్ 3: డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో గల ఓ రైస్ మిల్లులో అక్రమంగా కిరోసిన్ దందా చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు, బుధవారం సివిల్ సఫ్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు స్టేట్ టాస్క్ఫొర్స్ సివిల్ సఫ్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, జిల్లా జేసీ యాదిరెడ్డి ఆదేశాల మేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్ సఫ్లైస్ డీఎస్‌ఓ కొండల్‌రావు, స్టేట్ టాస్క్ఫొర్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓఎస్‌డీ జి.నాగేశ్వర్ బృందం, రైస్‌మిల్‌లో కిరోసిన్ లారీకి సంబంధించి సదరు కిరోసిన్ డీలర్ మునీం ద్వారా లారీలో ఉన్న కిరోసిన్ స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. లారీ ట్యాంకర్‌లో 9,200 లీటర్ల కిరోసిన్ ఉన్నట్లు బిల్‌లో ఉండగా, క్లోసింగ్ బ్యాలెన్స్‌షీట్‌లో 6,513 లీటరు లఉందని, అధికంగా ఉన్న 2,640 లీటర్లకు కిరోసిన్‌కు సంబంభించి సరైన సమాదానం చెప్పక దాటవేయడంతో, కిరోసిన్‌ను రేషన్ డీలర్లకు సరఫరా చేయకుండా, అక్రమంగా విక్రయిస్తున్నట్లు నిర్ధారించుకుని అధికారులు సదరు కిరోసిన్ డీలర్‌పై 6-ఏ కింద కేసును నమోదు చేసి, 6 లక్షల రూపాయల విలువల 9 వేల లీటర్ల కిరోసిన్‌తో కూడిన లారీని సీజ్ చేయడం జరిగిందన్నారు. అలాగే ట్యాంకర్ లారీలో డీజిల్ ట్యాంకులో సైతం డీజిల్‌కు బదులు కిరోసిన్ ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన నివేదికను జాయింట్ కలెక్టర్‌కు అందించనున్నట్లు డీఎస్‌ఓ కొండల్‌రావు తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లాలో నూతన రేషన్ కార్డుల కోసం 8వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో అర్హులైన 6 వేల మందికి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని డీఎస్‌ఓ తెలిపారు.

గ్యాస్ ఫిల్లింగ్ దుకాణంపై అధికారుల దాడి
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని స్థానిక గాంధీచౌక్‌లో గల ఆకుల శ్రీనివాస్ దుకాణంలో అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు, బుధవారం సివిల్ సఫ్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు స్టేట్ టాస్క్ఫోర్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దుకాణంలో ఒక పెద్ద గ్యాస్ సిలెండర్‌తో పాటు 10 చిన్న గ్యాస్ సిలెండర్లు, ఫిల్లింగ్ కిట్‌ను పట్టుకుని, దుకాణం యజమానిపై 6-ఏ కింద కేసు నమోదు చేసుకుని, ఫిల్లంగ్ కిట్‌తో పాటు సిలెండర్‌లను జప్తుచేసి, స్థానిక గాయిత్రి హెచ్‌పీ ఏజన్సీ వారికి అప్పజెప్పారు. ఇంకో మారు జనావాస ప్రాంతంలోఅక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేసినట్లైతే క్రిమినల్ కేసును నమోదు చేయడం జరుగుతుందని దుకాణ యజమానికి హెచ్చరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని జేసీ యాదిరెడ్డికి నివేదికలను అందజేయనున్నట్లు డీఎస్‌ఓ కొండల్‌రావుతెలిపారు. ఈ దాడుల్లో కామారెడ్డి ఎఎస్‌ఓ రాజశేఖర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ నాయబ్ తహశీల్దార్‌లు చంద్రరాజేశ్, రవీందర్‌లతోపాటు స్టేట్ టాస్క్ఫోర్స్ బృందం స్పెషల్ ఆఫీసర్ సుదర్శన్‌రెడ్డి, ఎస్‌ఐలు ఎ.కాశీనాథ్, రంగసుబ్బయ్య, స్థానిక విఆర్‌ఓ రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.