నిజామాబాద్

నిమిషాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, అక్టోబర్ 14: మండల కేంద్రమైన బాల్కొండలోని నిమిషాంభదేవి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిజామాబాద్ రిటైర్డ్ రైల్వే జడ్జి పీ.సరళ రాచందర్ కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు పెద్దఎత్తున అన్నదానం నిర్వహించారు. రిటైర్డ్ జడ్జి ఆలయానికి 5వేల రూపాయల మైక్‌సెట్‌ను వితర చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

దుర్గామాత మండపం వద్ద బోనాలు
ఆర్మూర్, అక్టోబర్ 14: ఆర్మూర్ పట్టణంలోని రంగాచారినగర్, చేనేత కాలనీలో వందేమాతరం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సతీమణి రజితారెడ్డి, స్థానిక కౌన్సిలర్ సంగీత ఖాందేశ్‌లు విచ్చేసి తలపై బోనాలు ఎత్తుకున్నారు. భక్తిశ్రద్ధలతో డప్పులతో ఊరేగింపుగా వెళ్లారు. పెద్దమ్మ తల్లి పూజారి శంకర్ బోనంతో చేసిన నృత్యం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకుడు ఖాందేశ్ శ్రీనివాస్, కాలనీ కమిటీ సభ్యులు ఆడెపు ప్రభాకర్, దాసరి ఆనంద్, నరేందర్, గంగాధర్, వందేమాతరం సభ్యులు నవనీత్, షరత్, గిరీష్, విష్ణు, వంశీ, రఘు పాల్గొన్నారు.