నిజామాబాద్

రాహుల్ సభకు భారీగా తరలి రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి రూరల్, అక్టోబర్ 16: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 20న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ కోరారు. మంగళవారం ఆయన డిచ్‌పల్లిలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఒక్కో మండలం నుండి కనీసం 8వేల మంది పైచిలుకు జనాలను తరలించేలా ప్రణాళికలు రూపొందించామని, కాంగ్రెస్ ముఖ్యులకు జన సమీకరణ బాధ్యతలు అప్పగించామన్నారు. ఈ బాధ్యతలను పార్టీ శ్రేణులు సక్రమంగా నిర్వర్తిస్తూ రాహుల్ సభను విజయవంతం చేసేందుకు అంకితభావంతో కృషి చేయాలన్నారు. ఉమ్మడి జిల్లా నుండి మొత్తం మూడున్నర లక్షల మందిని సభకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. రాహుల్ సభను విజయవంతం చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేలా, తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా రాహుల్ సభ ద్వారా స్పష్టమైన సంకేతాలు అందిస్తామని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తెరాస కుటుంబ పాలన కొనసాగిస్తోందని, ఆ పార్టీ పాలనకు చరమగీతం పాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. విలేఖరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, సింగిల్ విండో చైర్మెన్ గజవాడ జైపాల్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, నడిపల్లి ఎంపీటీసీ బీ.సాయన్న, స్కైలాబ్‌రెడ్డి, ఆశయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన సిహెచ్.కొండూర్ గ్రామస్థులు
నందిపేట, అక్టోబర్ 16: నందిపేట మండలం సిహెచ్.కొండూర్ గ్రామంలో మంగళవారం ఎమ్మెల్సీ ఆకుల లలిత ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నుండి సుమారు 25మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొండూర్ గ్రామానికి చెందిన న్యాకపు సంఘ సభ్యులు పార్టీలో చేరడంతో ఎమ్మెల్సీ ఆకుల లలిత వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్యామ్‌రావు, ఇంద్రుడు, బాలన్న, రాజు, ముత్యం, బుచ్చారెడ్డి, కిశోర్, నడిపి రాజన్న, నాగారావు తదితరులు పాల్గొన్నారు.

చాముండేశ్వరీ ఆలయంలో సామూహిక కుంకుమార్చన
నందిపేట, అక్టోబర్ 16: నందిపేట మండలం సిహెచ్.కొండూర్ గ్రామ శివారులోని చాముండేశ్వరీ ఆలయ ప్రాంగణంలో మంగళవారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 200మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. దుర్గాష్టామి సందర్భంగా అమ్మవారి ఊరేగింపు గ్రామంలోని వీధివీధిలో జరిపారు. అలాగే చాలామంది భక్తులు ఆలయం వద్ద సామూహిక సత్యనారాయణ వ్రతాల నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ ఆకుల లలిత కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు భక్తులకు ఉచితంగా అన్నసత్రాన్ని నిర్వహించారు.

మోర్తాడ్‌లో అన్నదానం
మోర్తాడ్, అక్టోబర్ 16: దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మోర్తాడ్‌లో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మహదేవ యువజన సంఘంతో పాటు యంగ్ బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో కూడా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. దుర్గామాతకు తాజామాజీ సర్పంచ్ దడివె నవీన్, శివలింగు శ్రీనివాస్‌తో పాటు నిర్వాహకులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ యార్డు వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

మాజీ ఎమ్మెల్యే పూజలు
ఆర్మూర్, అక్టోబర్ 16: ఆర్మూర్ పట్టణంలోని చేనేత కాలనీలో వందేమాతరం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద మంగళవారం తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యూత్ ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించగా కాలనీ మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి కుంకుమార్చన చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విచ్చేసి దుర్గామాత మండపం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులకు స్వయంగా వడ్డన చేశారు. అలాగే చిన్నబజార్‌లో గల లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గాదేవి మండపం వద్ద కుంకుమార్చన నిర్వహించారు. అలాగే లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయ ఆవరణలో ప్రతిష్టించిన దుర్గాదేవి మండపం వద్ద కూడా కుంకుమార్చన నిర్వహించారు.