నిజామాబాద్

ఎన్‌ఎస్‌ఎఫ్‌ను ప్రభుత్వమే నడిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, మే 12: ఆసియా ఖండంలోనే అత్యంత పేరుగాంచిన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఎన్‌ఎస్‌ఎఫ్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, కార్మికులకు రావాల్సిన జీతభత్యాలను వెంటనే చెల్లించాలని శివసేనా రాష్ట్ర అధ్యక్షుడు మురారీ డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ శ్రమ జీవుల జిల్లా అని, 70శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, మిగతా వారు బీడీ కార్మికులుగా జీవనాలు వెల్లదీస్తున్నారని అన్నారు. అయితే గత ప్రభుత్వాల వలే తెలంగాణ రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా నిజాంషుగర్ ఫ్యాక్టరీపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తనయురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తోందని, అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఇదే జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి కొనసాగుతున్నారని అన్నారు. జిల్లాకు చెందిన ఎంపి, మంత్రి అధికార పార్టీకి చెందిన వారు కావడం రైతులు చేసుకున్న పాపమా అని ఆయన ప్రశ్నించారు. ఎన్‌ఎస్‌ఎఫ్ మూతపడటంతో చెరకు పండించే రైతులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని, అక్కడ సరైన గిట్టుబాటు ధర లభించక ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని అన్నారు. ఎంతోమంది శ్రమతో ఎన్‌ఎస్‌ఎఫ్‌ను నిర్మించుకోవడం జరిగిందని, పోరాటాలు చేసైనా ఈ ఫ్యాక్టరీని కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వం స్పందించకుంటే న్యాయస్థానాల్లో వాజ్యం వేసి చట్టపరమైన పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల కంటే ముందు అన్ని రాజకీయ పార్టీలు, మూడు జిల్లాల నాయకులు తమతమ ప్రభుత్వలు ఏర్పడిన వెంటనే ఎన్‌ఎస్‌ఎఫ్‌ను తెరిపిస్తామని చెప్పడం జరిగిందన్నారు. ముఖ్యంగా టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 100రోజుల్లోనే ఎన్‌ఎస్‌ఎఫ్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందన్నారు. సిఎం కెసిఆర్ అయితే ఎన్‌ఎస్‌ఎఫ్‌కు పూర్వవైభవం తీసుకవస్తామని హామీల వర్షం గుప్పించారని, ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ విషయంలో కెసిఆర్ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకునేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు ఏప్రిల్ 2016లో తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 28ని తీసుకవచ్చి, 6సభ్యులతో ఒక కమిటీని నియమించడం జరిగిందన్నారు.
ఇందులో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, ఇండ్రస్టీస్ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా, మరో నలుగురు సభ్యులుగా నియమించడం జరిగిందన్నారు. ఈ జీవోలో మూడు మాసాల వ్యవధిలో యాజమాన్యం యొక్క(51శాతం) వాటా ఎంత ఉందో తేల్చాలని, అలాగే రైతులపరం చేసే సందర్భంలో వారికి మార్గదర్శకాలు కూడా పొందుపర్చాలని ఆ జీవోలో సూచించడం జరిగిందని అన్నారు. అయినప్పటికీ, ఇప్పటి వరకు కమిటీ కనీసం ఎన్‌ఎస్‌ఎఫ్‌ను సందర్శించిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా ఎన్‌ఎస్‌ఎఫ్ ఫ్యాక్టరీపై ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో శివసేనా ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో శివసేనా రాష్ట్ర కార్యదర్శి గంగాధర్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు గోపికిషన్ తదితరులు పాల్గొన్నారు.