నిజామాబాద్

ఈవీఎం, వీవీ ప్యాట్‌లపై పూర్తి అవగాహనతో ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, నవంబర్ 15: ఇవిఎమ్, వివిప్యాట్ యంత్రాలపై ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పూర్తిగా అవగాహన కల్గి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ అన్నారు. గురువారం జిల్లాకేంధ్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ అధికారులకు నిర్వహించిన ఇవిఎమ్,వివిప్యాట్‌ల శిక్షణ శిబిరానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు 50మందికి ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల బాధ్యతలు, కీలకమని, శిక్షణ కార్యక్రమాల ఉదయం, సాయంత్రం, రెండు పూటలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఇందులో ఒక పూట మొత్తం ఇవిఎమ్,వివిప్యాట్ యంత్రాలపై అవగాహన కార్యక్రమం, ఉంటున్నందున పూర్తి స్థాయిలో శిక్షణ పొందాలని అన్నారు. కామారెడ్డి -16అసెంబ్లీ నియోజక వర్గానికి సంబందించి 250పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయని, వీటికి గాను 300కంట్రోల్ యూనిట్స్, 300బ్యాలెట్ యూనిట్స్, 315వివిప్యాట్ యంత్రాలు కేటాయించడం జరిగిందన్నారు. ఈ ఎన్నికలలో ఓటర్ స్లీప్‌లో ఒటర్ పేరు ఫోటో, పోలింగ్ స్టేషన్ మ్యాప్, స్లీప్ వెనుక నిబందనలు ఉంటాయని అన్నారు. కంట్రోల్ యూనిట్ ఎం3 వెర్షన్ పూర్తి ఆదునీకతతో ఉందని అన్నారు. దివ్వాంగులకు పిడబ్ల్యుడి 2016చట్టం ప్రకారం పోలింగ్ స్టేషన్‌లో ప్రత్యేక సదుపాయలు కల్పించడం జరుగుతోందని, దివ్వాంగులకు, వయోవృద్దులకు వెంటనే ఓటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ముక్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

మహాసుదర్శన యాగానికి ఏర్పాట్లు పూర్తి
బాల్కొండ, నవంబర్ 15: మండల కేంద్రమైన బాల్కొండలోని లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో జరిగే మహాసుదర్శన యాగానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ యాగానికి స్థానిక పురోహితులు నారాయణస్వామి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవతా మూర్తులకు కల్యాణ మండపంతో పాటు ప్రతిరోజు 500 జంటలతో యాగ నిర్వాహణ జరుగుతుండగా, వాటికి సంబంధించిన యజ్ఞ గుండాల నిర్మాణం పూర్తయింది. దీంతో పాటు మహా స్వాగత తోరణంతో పాటు మూడు రోజుల పాటు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల వేదిక, అన్నదాన సత్ర వేదిక తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. పర్యావరణ సిద్ధికి, సకల శుభాల కోసం ఈ యాగాన్ని నిర్వహించడం జరుగుతుందని నారాయణస్వామి తెలిపారు. ఇందులో పాల్గొనదల్చిన వారు 9440549321, 7997088660 నెంబర్లలో సంప్రదించాలన్నారు. హోమంలో పాల్గొన్న వారికి పూజా సామగ్రి, హోమగుండం, మహాసుదర్శనయంత్రం ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుందని, యాగంలో పాల్గొనే జంటకు ఒకరోజు మాత్రమే అవకాశం లభిస్తుందని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

‘బిగాల’ మలివిడత నామినేషన్ సెట్ దాఖలు
కంఠేశ్వర్, నవంబర్ 15: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి గురువారం అర్బన్ తాజామాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితతో కలిసి మలివిడతగా రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. బిగాల గణేష్‌గుప్తా తండ్రి బిగాల కృష్ణమూర్తి కూడా బిగాలకు మద్దతుగా ఒక సెట్టు అనుబంధ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అర్బన్ తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల మట్లాడుతూ, నగర అభివృద్ధికి విశేషంగా కృషి చేసినందున ప్రజలు మరోసారి తనను గెలిపించాలని కోరారు. ఆయన వెంట ఎం.పీ కవిత, నగర మేయర్ ఆకుల సుజాత, ఈగ గంగారెడ్డి, నుడా చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

శివాలయంలో కొనసాగుతున్న చండీయాగం
మోర్తాడ్, నవంబర్ 15: మోర్తాడ్ శివాలయంలో శ్రీ మహారుద్ర పురచ్ఛరణ సహిత శతచండీ మహాయాగం వరుసగా రెండవ రోజు కూడా కొనసాగింది. గురువారం ఉదయం ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం అమ్మవారి విగ్రహం వద్ద వేదపండితులు పలు వేదాలను పారాయణం చేశారు. అనంతరం హోమశాలలో వేదోక్తంగా చండీయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కురుమంచి చంద్రశేఖర్‌శర్మ మాట్లాడుతూ, లోక కల్యాణార్థమై వేదోక్తంగా చండీయాగం నిర్వహిస్తున్నామని అన్నారు. బ్రహ్మశ్రీ శ్రౌతి రాజశేఖరశర్మ ఆధ్వర్యంలో 25మంది వేదపండితులు ఈ యాగంలో పాల్గొంటున్నారు. ఆలయానికి అధిక సంఖ్యలో వస్తున్న భక్తులు ప్రత్యేక అర్చన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.