నిజామాబాద్

ఆలోచించి ఓటేయాలి : ఎంపీ కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, నవంబర్ 15: జరగబోయే ఎన్నికల్లో ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలని, ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడాలని నిజామాబాద్ ఎంపీ కవిత కోరారు. గురువారం ఆర్మూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. దోబీఘాట్ వద్ద భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్ధేశించి ఆమె మాట్లాడారు. గతంలో ఎన్నడూ రానన్ని నిధులు నాలుగున్నర సంవత్సరాలలో ఆర్మూర్‌కు వచ్చాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం కూడా ఆర్మూర్‌పై ఉండడంతో పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని చెప్పారు. పనులు చేయడంలో జీవన్‌రెడ్డి కృషి గొప్పదని అన్నారు. 150 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించి ఎర్రజొన్నలను కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇచ్చామని అన్నారు. బీడీల పింఛన్‌ను రెండు వేల రూపాయలకు పెంచి ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసూతి కోసం వెళ్తే అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయని, కేసీఆర్ కిట్టు ఇస్తున్నామని, మగబిడ్డ పుడితే 12 వేలు, ఆడబిడ్డ పుడితే 13 వేలు ఇస్తున్నామని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీల నాయకులు వస్తుంటారని, అందరి మాటలు విని ఏ పార్టీకి ఓటు వేస్తే బాగుంటుందో ఆలోచించి వేయాలని ఆమె కోరారు. బతుకమ్మ చీరలను పంచనీయకుండా అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలితను నిలదీయాలని ఆమె చెప్పారు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని, ఇక్కడి ప్రజలను మోసం చేయడానికి, ఆంధ్రకు నీళ్లు తీసుకెళ్లడానికి కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని, 2 వేల పింఛన్, రైతుబంధు కింద 10 వేలు ఇస్తామని అన్నారు. జీఓల జీవన్‌రెడ్డిని ఆర్మూర్‌లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఆర్మూర్ ప్రజలు ధర్మం, న్యాయం వైపు నిలబడాలని ఆమె చెప్పారు.
భారీ ర్యాలీ
టీఆర్‌ఎస్ ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని దోభిఘాట్ వద్ద నుంచి పాతబస్టాండ్ వరకు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దోభిఘాట్ వద్ద ప్రారంభమైన ర్యాలీ జెమ్మన్‌జెట్టీ, పెద్దబజార్, గోల్‌బంగ్లా, పాతబస్టాండ్ మీదుగా తహశీల్ కార్యాలయ సమీపం వరకు సాగింది. టాప్‌లేని వాహనంలో ఎంపీ కవిత, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ మధుశేఖర్, కోటపాటి నర్సింహం నాయుడు తదితరులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆర్మూర్ పట్టణం గులాబిమయంగా మారింది.