నిజామాబాద్

మళ్లీ ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమ్‌గల్, నవంబర్ 16: ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేస్తానని టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం భీమ్‌గల్ మండలంలోని బడాభీమ్‌గల్, ఎన్‌జీ.తాండ, రూప్లాతాండ, చేంగల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, గత అరవై సంవత్సరాల్లో ఆంధ్ర పాలకులు చేయలేని అభివృద్ధిని, తెరాస అధికారం చేపట్టిన నాలుగేళ్లలో చేసి చూపించడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని చేపట్టి ఎకరానికి 4వేల రూపాయల చొప్పున సంవత్సరానికి 8వేల రూపాయల పెట్టుబడి అందించడం జరిగిందన్నారు. మహిళలకు ఆసరా పెన్షన్లు, జీవన భృతి తదితర పెన్షన్లు అందించడం జరిగిందన్నారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు చేదోడుగా నిలిచేందుకు షాదీముబారక్ కల్యాణలక్షిమ పథకాలు, గర్భిణీ స్ర్తిలకు కేసీఆర్ కిట్టు లాంటి పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. మరోసారి తెరాసకు పట్టం కడితే
ఆసరా పెన్షన్షను 2016రూపాయలకు, వృద్ధులకు 3016రూపాయలు, జీవనభృతి 2016రూపాయలు అందించనున్నామని అన్నారు. బడాభీమ్‌గల్ గ్రామంలో 1250మందికి పెన్షన్లు అందిస్తున్నామని, ఇంకా ఎవరికైనా రాకపోతే అందులో అర్హులైన వారందరికి అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గ్రామంలో 64లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించడం జరిగిందని, అలాగే ప్రతి కుల సంఘానికి కమ్యూనిటీ హాల్స్‌ను మంజూరీ చేయడం జరిగిందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు మహాకూటమి పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండునేందుకు వస్తున్నారని, అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలకు హితవు పలికారు. ఈ సందర్భంగా బడాభీమ్‌గల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన సుమారు 20మంది ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన వెంట ఎంపీపీ కొండ గోదావరి, జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి, తెరాస సీనియర్ నాయకులు బొనగిరి మురళి, ముత్తెన్న, రాజన్న, గణేష్, కిషన్‌తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు.