నిజామాబాద్

జోరందుకున్న నామినేషన్ల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 16: ఎన్నికల్లో పోటీ చేసేందుకు కీలకమైన నామినేషన్ల దాఖలు గడువు ముగిసేందుకు మరో మూడు రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో ఆయా రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ నామపత్రాలను దాఖలు చేసేందుకు ఆరాటపడుతున్నారు. ఈ నెల 12వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుండే నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ, మొదటి నాలుగు రోజుల పాటు అంతంతమాత్రంగానే వచ్చాయి. ఐదవ రోజైన శుక్రవారం నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలలో 17నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలితారాఘవేందర్ అట్టహాసంగా నామినేషన్ వేశారు. దాస్‌నగర్ నుండి వందలాది వాహనాలతో ర్యాలీని చేపట్టి మాక్లూర్, నందిపేట, ఆర్మూర్ మండలాల మీదుగా ఆర్.ఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. బీజేపీ అభ్యర్థి పొద్దుటూరి వినయ్‌కుమార్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేయగా, స్వతంత్ర అభ్యర్థిగా సుంకె శ్రీనివాస్ నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. బోధన్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి పీ.సుదర్శన్‌రెడ్డి తరఫున ఆ పార్టీ మైనార్టీ నాయకులు రెండు సెట్ల నామినేషన్‌లు దాఖలు చేయగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్‌ఆమిర్, బీఎస్పీ అభ్యర్థిగా ఎస్.పాండు కూడా నామినేషన్‌లు వేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెరాస అభ్యర్థిగా ఇప్పటికే నామినేషన్‌ను దాఖలు చేయగా, శుక్రవారం బీజేపీ అభ్యర్థిగా పీ.సంగారెడ్డి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా చాకలి కొండని అంజయ్యలు నామినేషన్‌లు దాఖలు చేశారు. ఇక బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా కాసుల బాల్‌రాజ్‌కు టిక్కెట్‌ను ఖరారు చేయగా, అదే పార్టీ తరఫున రెబల్ అభ్యర్థులుగా సంగం శ్రీనివాస్‌గౌడ్, వీ.మల్యాద్రిలు నామినేషన్లు వేయడం కాంగ్రెస్ శిబిరంలో ఎన్నికల రాజకీయాన్ని వేడెక్కించింది. అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా బీ.శ్రీనివాస్ రెండు సెట్లు నామినేషన్ పత్రాలు వేయగా, బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా మల్యాల గోవర్ధన్, సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా అబ్దుల్ రహీమ్‌లు నామినేషన్‌లు సమర్పించారు. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ నుండి ఆలిండియా జైహింద్ పార్టీ అభ్యర్థిగా గుగులోత్ బాలరాజు, స్వతంత్ర అభ్యర్థిగా బీబీ.నాయక్‌లు నామినేషన్‌లు వేశారు. బాల్కొండ తెరాస అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి భీమ్‌గల్‌లో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్‌ను అందజేశారు.