నిజామాబాద్

ఘనంగా ప్రారంభమైన మహాసుదర్శన యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, నవంబర్ 16: మండల కేంద్రమైన బాల్కొండలోని శ్రీ లక్ష్మినర్సింహాస్వామి ఆలయంలో మహాసుదర్శన యాగాన్ని శుక్రవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. యాగ నిర్వాహకులు హరాచారి నారాయణతో పాటు వారి పరివారము, బ్రాహ్మణులచే యాగశాల ఆహ్వానము, గణపతి, లక్ష్మి, విష్ణు, శివ, లింగ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో పాటు బ్రాహ్మణ పూజ, పుణ్యావచనం నిర్వహించి, యజ్ఞంను ప్రారంభించారు. ఈ సందర్భంగా యజ్ఞంలో పాల్గొనే జంటలు అలంకరణతో కొత్త బట్టలు ధరించి, కుల దేవతలతో పాటు యజ్ఞ దేవతలకు పూజలు చేసి యజ్ఞంలో పాల్గొన్నారు. అనంతరం యజ్ఞ సమాప్తంతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరాచారి నారాయణ పంతులు మాట్లాడుతూ, లోకకల్యాణార్థం, ప్రకృతి శుద్ధి కోసం ఈ యాగాన్ని నిర్వహించడం జరిగిందని, ప్రజల్లో భక్త్భివం పెంపొందించి, వారు సుఖఃసంతోషాలతో జీవించాలని కోరుతూ ఈ యజ్ఞ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, మూడు రోజుల పాటు ఇది కొనసాగుతుందన్నారు. సాయంత్రం సమయంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. యజ్ఞంలో పాల్గొన్న జంటలకు వేదపండితులు ఆశీర్వచనాలతో పాటు ప్రసాదాలను అందజేశారు. అనంతనం భక్తలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఆశీర్వదించండి
కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి
ఇందూర్, నవంబర్ 16: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చి స్వరాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆశీర్వదించాలని ఆ పార్టీ బోధన్ నియోజకవర్గం నాయకుడు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎడపల్లి మండలం ఠాణాకలాన్, ధర్మారం గ్రామాల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించగా, కరుణారెడ్డి పాల్గొని ప్రజలను చైన్యపర్చారు. తెలంగాణలో వందలాది మంది యువకులు, విద్యార్థులు ఆత్మబలిదాలు చేసుకుంటే చలించిపోయిన ఆనాటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే అమరవీరుల త్యాగాలు, అన్ని వర్గాల ప్రజల పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టంకట్టడం జరిగిందని, తెలంగాణ ఏర్పడితే తమ బతుకులు మారుతాయనుకుంటే, తెరాస హయాంలో అన్నివర్గాలు అధోగతిపాలయ్యారని అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ, కుటుంబ పాలనను కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌కు ఈసారి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సింగ్, జిల్లా ఉపాధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, శంకర్‌నాయడు, పులి శ్రీను, పెరిక లక్ష్మణ్, భాస్కర్‌రెడ్డి, ఎర్ర అబ్బయ్య, ఆకుల సురేష్, ఈరంటి లింగం, ఎల్కి సంతోష్‌రెడ్డి, రాజేందర్‌గుప్తా, సూర కిరణ్, అమానుల్లా, ఫర్హాన్, బషీర్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.