నిజామాబాద్

ఏదైనా గుర్తింపు కార్డుతో ఓటు వేయొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డిరూరల్, డిసెంబర్ 6: ఏదైనా గుర్తింపు కార్డు వెంట ఉంచుకుంటే ఓటును సద్వినియోగం చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. 12 రకాలైన గుర్తింపు కార్డు తెచ్చుకుంటే ఓటు వేయవచ్చని అన్నారు. ఒకటి పాస్‌పోర్టు, డ్రైవింగ్‌లైసెన్స్, ప్రభుత్వ, ప్రభుత్వరంగ, పబ్లిక్ లిమిటెడ్ కంపనీలలో పనిచేయుచున్న ఉద్యోగుల గుర్తింపు కార్డులు, పోస్ట్ఫాస్, బ్యాంక్ పాస్‌పుస్తకం, పాన్‌కార్డు, ఆర్‌జిఐ జారీ చేసిన ఎన్‌పి ఆప్ , స్మార్ట్ కార్డు, ఉపాదిహామి గుర్తింపు కార్డు, కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్యబీమా కార్డు, ఫొటో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, ఈసీ జారీ చేసిన ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులో ఏదైనా చూసి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.

డీ-3 సెక్షన్‌లో సబ్‌స్టేషన్ కావాల్సిందే
కంఠేశ్వర్, డిసెంబర్ 6: నగరంలోని బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మితమవుతున్న కలెక్టరేట్ సముదాయంలో గల డీ-3 సెక్షన్ పరిధిలో నిరంతర విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. నగరంలో డీ-1 నుండి డీ-7 వరకు విద్యుత్‌కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయి. అయితే మిగతా సెక్షన్ల పరిధిలో విద్యుత్‌కు అంతరాయం అంతగా ఏర్పడడం లేదు. కేవలం డీ-3 సెక్షన్ పరిధిలో మాత్రమే తరుచూ విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతూ స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకు నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణం, ఐటీ హబ్, ఇతర పరిపాలన భవంతుల నిర్మాణాలు జరుగుతుండడమే కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. వీటి నిర్మాణాల కోసం పెద్దఎత్తున విద్యుత్ వినియోగం అవుతుండడంతో తరుచూ పవర్ ట్రిప్ అవుతోందని వాపోతున్నారు. అదనంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. డీ-3 సెక్షన్ పరిధిలో ఉన్న లోడ్‌కి అనుగుణంగా ప్రత్యేకంగా సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం పలుమార్లు సంబంధిత అధికారులు సైతం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా, ఇంత వరకు దీనిపై స్పందన లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సబ్‌స్టేషన్ నిర్మాణం చేసి డీ-3 సెక్షన్ పరిధిలో విద్యుత్ సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.