నిజామాబాద్

ప్రయాణికులతో కిక్కిరిసిన రైల్వే స్టేషన్, బస్టాండ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, డిసెంబర్ 6: తెలంగాణ అసెంబ్లీకి శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నందున తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు తమ తమ స్వస్థలానికి వెళ్లేందుకు ప్రయాణం కావడంతో బస్టాండ్, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి కనిపించాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఆరు డిపోల పరిధిలో 659బస్సులు ఉండగా, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కోసం కలెక్టర్ ఆదేశాలతో 213బస్సులను కేటాయించారు. దీంతో కొన్ని రూట్లకు బస్సులు రద్దవగా, మరికొన్ని రూట్లలో బస్సు సర్వీసుల సంఖ్యను కుదించారు. ఫలితంగా ప్రయాణికుల అవసరాలకు సరిపడా బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు ఒకింత ఇబ్బందులకు గురయ్యారు. కామారెడ్డి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఇక తమ ఊళ్లకు వెళ్లడానికి బస్సులు తక్కువగా ఉండటంతో ఆయా బస్టాండ్‌లలో బస్సుల కోసం ప్రయాణికులు వేచిచూడడం కనిపించింది. ఉమ్మడి జిల్లాలో 17 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతరాత్ర కారణాల రీత్యా వేరే ప్రదేశాల్లో ఉంటున్న వారంతా స్వస్థలాలకు తిరిగి వస్తూ, ఇక్కడ ఉంటున్న ఇతర ప్రాంతాల వారు తమ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తుండడంతో ప్రయాణ ప్రాంగణాలన్నీ కిటకిటలాడాయి. ఒక్క నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోనే 2 లక్షల 41 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కును శుక్రవారం రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి వారి నియోజకవర్గాల్లో వినియోగించుకోనున్నారు. అందులో భాగంగానే ప్రజలు తమ తమ స్వంత ఊళ్లకు వెళ్లేందుకు బస్టాండ్‌ల వైపు పయనం అయ్యారు.

అంబేద్కర్ వర్ధంతి
నవీపేట్, డిసెంబర్ 6: మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో అంబేద్కర్ 62వ వర్ధంతిని పురస్కరించుకుని నవీపేట, జనే్నపల్లి, బినోల, దర్యాపూర్, కోస్లీ, మోకన్‌పల్లి, అబ్బాపూర్ (ఎం) గ్రామాలలో అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బినోల మాజీ సర్పంచ్ సుధాకర్, పోశెట్టి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ అందరివాడు
నవీపేట్ మండలంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఏబీవీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 62వ వర్ధంతిని పురస్కరించుకుని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, అంబేద్కర్ అందరివాడని, గొప్ప ఆదర్శ నాయకుడని ఆయన చూపిన బాటలో మనమందరం నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పండిత్, శ్రీనివాస్, ప్రవీణ్, విద్యార్థులు పాల్గొన్నారు.