నిజామాబాద్

ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, మే 16: ఫీల్డ్‌అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వారికి కనీస వేతనాలను అమలు చేయాలని ఎఐసిసి అధికార ప్రతినిధి, మాజీ ఎంపి మధుయాష్కీగౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని ఎంపిడిఓ కార్యాలయం ఎదుట ఫీల్డ్‌అసిస్టెంట్లు చేపట్టిన సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్ల పాత్ర కీలకంగా ఉండిందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ వీరి సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. గత 11సంవత్సరాల నుండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారని, ప్రభుత్వం చెల్లిస్తున్న చాలీచాలని వేతనాలతో వీరి జీవనం దుర్భరంగా మారిందన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పిస్తున్న వీరికి కనీసం ఉద్యోగ భద్రతను కూడా ప్రభుత్వం కల్పించడంలేదన్నారు. వీరి వేతనాన్ని 5వేల నుండి 10వేల రూపాయలకు పెంచి, పర్మినెంట్ చేయాలన్నారు. ప్రతి ఫీల్డ్‌అసిస్టెంటుకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చకా ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేస్తోందని, అందులో భాగంగానే ఫీల్డ్‌అసిస్టెంట్లను సైతం వంచిస్తోందన్నారు. మంత్రి కెసిఆర్ పెద్దపెద్ద మాటలు చెబుతుంటారని, ఫీల్డ్‌అసిస్టెంట్లు గడిచిన వారం రోజులుగా సమ్మె చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఫీల్డ్‌అసిస్టెంట్ల సమస్యలను కేటిఆర్, మంత్రి జూపల్లి కృష్ణారావుతో చెప్పి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తాను కూడా ప్రభుత్వానికి లేఖ రాస్తానని మధుయాష్కీ హామీ ఇచ్చారు. మధుయాష్కీ వెంట డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, ముప్ప గంగారెడ్డి, వెంకుల్, ఫీల్డ్‌అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడు మల్లేశ్, గంగాధర్, లక్ష్మన్, బలరాం తదితరులు పాల్గొన్నారు.