నిజామాబాద్

కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, డిసెంబర్ 9: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏఎంసీ గోదాంలో ఏర్పాటు చేసిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ తనిఖీ చేసి పరిశీలించారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రం అయినందున అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం లోపల, బయట కౌంటింగ్ రోజు సిబ్బంది, ఎన్నికల అధికారులు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కౌంటింగ్ కేంద్రం బయట ఏర్పాటు చేసిన సౌకర్యాలు అక్కడి పరిస్థితులను ఆయన స్వయంగా పరిశీలించారు. కామారెడ్డి రిటర్నింగ్ అధికారి రాజేంద్రకుమార్, ఎల్లారెడ్డి రిటర్నింగ్ అధికారి దేవేందర్‌రెడ్డి, జుక్కల్ అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి రాజేశ్వర్‌లకు కౌంటింగ్‌కు సంబందించి పలు సూచనలు అందించారు. కలెక్టర్ వెంట జేసీ యాదిరెడ్డితో పాటు ఎన్నికల సిబ్బంది ఉన్నారు.
14న అభయాంజనేయ స్వామి ఆలయ
ప్రథమ వార్షికోత్సవ వేడుకలు
నిజాంసాగర్, డిసెంబర్ 9: మండలంలోని బ్రహ్మణ్‌పల్లి గ్రామ శివారులోగల, జాతీయ రహదారి ప్రక్కన శ్రీ అభయాంజనేయ స్వామి ఏకశిలాసహిత శివపంచాయతన, విగ్రహ ప్రథమ వార్షికోత్సవం వేడుకలను, ఈనెల 14వ తేదిన శుక్రవారం నిర్వహించడం జరుగుతోందని, అంజనాద్రి ఆలయం నిర్మాణ కర్త కిషోర్‌కుమార్ పట్లోళ్ల ఆదివారం తెలిపారు. అభయాంజనేయస్వామి ఏకశిల ప్రధమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని,ద్వజస్థంబం ,శిఖర ప్రతిష్టాపణ కార్యక్రమం నిర్వహించడం జరగుతోందన్నార. ఉదయం 6.15 నిమిషాలకు ద్వజస్థంబం, ఉదయం 9.30 నిమిషాలకు శిఖర ప్రతిష్టాపణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. అభిషేకాలు, మూల మంత్రఅవాహనం, లక్ష తమలపాకుల అర్చన, పూర్ణాహుతి తదితర పూజాది కార్యక్రమాలను నిర్వహించడం జరగుతోందన్నారు. శ్రీఉత్తరాది పీఠాధీశ్వర శ్రీమాన్ మద్వాచార్య శ్రీశ్రీశ్రీ 1008 సత్యాత్మ తీర్థస్వామి వారి దివ్యాశిస్సులతోకార్యాక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. పూజాకార్యక్రమాల అనంతరం అభయాంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలోఅన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతొందన్నారు. ఈకార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై ఆశీస్సులను పొందాలని కోరారు.