నిజామాబాద్

త్రిముఖ పోరులో విజేత ఎవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, డిసెంబర్ 9: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా కొనసాగింది. దాంతో విజేత ఎవరో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అర్బన్ నియోజకవర్గం నుంచి 21మంది అభ్యర్థులు బరిలో నిలువగా, పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల అభ్యర్థుల మధ్యే కొనసాగిందని విశే్లషకులు చెబుతున్నారు. ప్రజా ఫ్రంట్ అభ్యర్థిగా తాహెర్‌బిన్ హందాన్, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా అర్బన్ తాజామాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, బీజేపీ అభ్యర్థిగా యెండల లక్ష్మినారాయణ, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా నరాల రత్నాకర్, బీఎస్‌పీ అభ్యర్థిగా మహింతి రమేష్‌తో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసిన విషయం తెలిసిందే. పోటీ మాత్రం త్రిముఖంగా కొనసాగిందని చెప్పాలి. అర్బన్ నియోజకవర్గంలో 2లక్షల 41వేలకు పైగా ఓట్లు ఉండగా, ఇందులో అత్యధికంగా ఓట్లు గల్లంతుకావడంతో అభ్యర్థులు ఒక దశలో ఆందోళనకు గురయ్యారు. బీజేపీ అభ్యర్థైన యెండల లక్ష్మినారాయణ ఓట్లు గల్లంతు కావడంపై మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆందోళనకు దిగడం గమనార్హం. ఓటింగ్ శాతం గణనీయంగ పెరగడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొన్నదని చెప్పాలి. ఓట్ల గల్లంతు ఎవరికి నష్టం కలిగిస్తుందో వేచి చూడాల్సిందే. ఇక అర్బన్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు గతం కంటే 15శాతం పెరగడంతో ఎవరికి వారే తమదే గెలుపని బేరీజు వేసుకుంటున్నారు. అర్బన్ తాజామాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, కేసీఆర్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ ఫలాలను ప్రజల వద్దకు తీసుకవెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ముఖ్యంగా కేసీఆర్ అమలు చేసిన షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ, మిషన్ భగీరథ, ఆసర పింఛన్‌లు, బీడీ, ఒంటరి మహిళలకు జీవన భృతి తదితర పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడం జరిగింది. అలాగే బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ టీఆర్‌ఎస్ సర్కార్ అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేసి ఓట్లను అభ్యర్థించారు. యూజీడీ పనులకు నిధులు తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు 201కోట్లు మంజూరు చేయించానని, అనుకోని విధంగా 2014లో ఎన్నికలు రావడంతో ఆ నిధులు రాలేకపోయాయని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అర్బన్ ఎమ్మెల్యేగా బిగాల గణేష్‌గుప్తా ఈ పనులకు కేవలం 28కోట్ల రూపాయలు తీసుకువచ్చారని, ఇందులో ఆయన చేసిందేమిలేదని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఏ ఒక్క నిరుపేదకు ఇవ్వలేదని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇంక తన గెలుపుకోసం కేంద్ర మంత్రులనే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీని నగరానికి తీసుకువచ్చి ప్రజలను ఆకర్షించారు. ఇక ప్రజాఫ్రంట్ అభ్యిర్థిగా పోటీ చేసిన తాహెర్‌బిన్ హందాన్ టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతిని ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థించారు. తాహెర్‌బిన్ హందాన్ సౌమ్యుడు, నిజాయితీపరుడు కావడంతో మైనార్టీలు, హిందువుల్లో మంచి పేరు ఉందని చెప్పాలి. గతంలో టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్న మైనార్టీలు ఈ నెల 7న జరిగిన ఎన్నికల్లో మూడవ వంతు తాహెర్‌కు ఓటు వేసినట్లు తెలుస్తోంది. అలాగే తాహెర్‌బిన్‌కు టీడీపీ, సీపీఐ, టీజేఎస్ మద్దతు ఉండటంతో ఈ పార్టీల ఓట్లు తాహెర్‌బిన్ హందాన్‌కు పడినట్లు తెలుస్తోంది. 2014లో అర్బన్ నియోజకవర్గంలో 45శాతం ఓట్లు పోలు కాగా, ఈ నెల 7న జరిగిన ఎన్నికల్లో 60శాతం పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో అభ్యర్థులు విజయం తమదంటే, తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనా నగర ప్రజలు ఎవరి పక్షాన నిలిచారన్నది ఈ నెల 11న జరిగే కౌంటింగ్‌తో తేటతెల్లం కానుంది.