నిజామాబాద్

ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 9: ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సమావేశ మందిరంలో ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలతో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు, సిబ్బంది, ప్రజలు, అభ్యర్థులు, ఆయా పార్టీల ప్రతినిధుల సహకారంతో అతిపెద్ద పోలింగ్ ప్రక్రియను శాంతియుతంగా, ప్రశాంతంగా పూర్తి చేశామని, ఈ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక చిట్టచివరి ఘట్టం ఓట్ల లెక్కింపు అని అన్నారు. పోలింగ్ క్షేత్రస్థాయిలో జరిగితే, ఓట్ల లెక్కింపు నాలుగు గోడల మధ్య జరిగినప్పటికీ, చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుందని అధికారులకు సూచించారు. కౌంటింగ్ ప్రక్రియను అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బందితో పాటు కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు జాగ్రత్తగా గమనిస్తుంటారని, అన్ని జాగ్రత్తలు, నిబంధనలు పాటించుకుంటూ కొనసాగించాల్సి ఉంటుందని అన్నారు. దాంతో పాటు సాంకేతికను ఉపయోగించుకుంటూ ముందుకు సాగాలన్నారు. కౌంటింగ్‌కు సంబంధించి ఈసీఐకి సమయానికి నివేదికలు ఆలస్యం లేకుండా పంపాలని, పోస్టల్ బ్యాలెట్‌ను ముందుగానే లెక్కించాలని అధికారులకు సూచించారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్‌కు అవసరమయ్యే సామాగ్రిని అందుబాటులో ఉంచాలని, ముఖ్యంగా కౌంటింగ్‌లో తప్పులు దొర్లకుండా చూసుకోవాలన్నారు. కౌంటింగ్‌కు హాజరయ్యే సిబ్బంది, ఏజెంట్ల వద్ద సెల్‌ఫోన్లు అనుమతించవద్దని, ఈవీఎంలలో రిజల్ట్ బటన్ మాత్రమే నొక్కెలా శిక్షణ ఇచ్చామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్‌ఓ అంజయ్య, ఆర్‌ఓలు జాన్‌సాంసన్, వెంకటేశ్వర్లు, గోపిరాం, శ్రీనివాస్, వేణు, రమేష్, ఏఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, అధికారులు
ఇదిలాఉండగా, ఈ నెల 11న నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించే ఓట్ల లెక్కింపు సందర్భంగా కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావుతో పాటు అధికారులు ఆదివారం కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండే భవనంలో నిజామాబాద్ అర్బన్, రూరల్, ఇండోర్ స్టేడియంలో ఆర్మూర్, బాల్కొండ, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల లెక్కింపు నిర్వహించనున్నారు. కాగా, ప్రధాన గేట్‌కు కుడి వైపునుండి బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల కౌంటింగ్‌కు వెళ్లే వారికి దారి ఉంటుందని, రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎడమవైపు నుండి గేటుకు ఎదురుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ సమాచారాన్ని అందించేందుకు ఫెసిలిటేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.