నిజామాబాద్

దళారీ వ్యవస్థను రూపుమాపి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, మే 17: మధ్యదళారీ వ్యవస్థతో తీవ్రంగా నష్టపోతున్న మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేజ్ కల్చర్ ద్వారా పెంచిన చేపలను మత్స్యకార్మిక కుటుంబాలే నేరుగా విక్రయించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మత్స్యకార్మిక కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ముందుగా మధ్యదళారీ వ్యవస్థను అసలే ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఎడపల్లి మండలం జానకంపేట్ అశోక్‌సాగర్ చెరువులో కేజ్ కల్చర్ విధానంలో చేపల పెంపకాన్ని చేపట్టగా, జానకంపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన చేపల విక్రయ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణాతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, సమైక్య పాలనలో పాలకులు మత్స్య పరిశ్రమపై చిన్నచూపు చూడటంతో మత్స్యకార్మికులు దుర్భర జీవితాలను వెల్లదీయడం జరిగిందన్నారు. దానికి తోడు మధ్యదళారీ వ్యవస్థ రాజ్యమేలడంతో చేసిన కష్టానికి ఫలితం దక్కపోవడంతో ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ పట్టణాలకు వలసవెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అయితే తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలతో పాటు మత్స్యకారుల జీవితాల్లోనూ వెలుగులు నింపేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా ముందుగా తాను జార్ఖండ్ రాష్ట్రాన్ని సందర్శించి, అక్కడ అమలవుతున్న కేజ్ కల్చర్ విధానాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. అనంతరం మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులను జార్ఞండ్‌కు పంపించి, కేజ్ కల్చర్ విధానంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. గత సంవత్సరం ఆగస్టు మాసంలో తెలంగాణలోని కొన్ని రిజర్వాయర్లను ఎంపిక చేసి కేజ్ కల్చర్ విధానం ద్వారా చేప పిల్లల పెంపకానికి శ్రీకారం చుట్టామని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్‌లో మత్స్య శాఖకు 18కోట్ల రూపాయలు కేటాయించి, 100శాతం సబ్సిడీతో కేజ్ కల్చర్ విధానంలో చేప పిల్లల పెంపకానికి తోడ్పాటు అందించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా జానకంపేట్ అశోక్‌సాగర్ చెరువులో మొత్తం 24బాక్స్‌లను ఏర్పాటు చేసి, ఒక్కో బాక్స్‌లో 6వేల చొప్పున చేప పిల్లలను వేయడం జరిగిందన్నారు. గతంలో ఒక్కో చెరువులో లక్ష చేప పిల్లలను వేస్తే రెండు సంవత్సరాల తర్వాత కనీసం 20శాతం చేపలు కూడా మత్స్యకారులకు లభించేవి కావని, వాటిని కూడా మధ్యదళారులకు కిలోకు 30నుండి 40రూపాయల చొప్పున విక్రయించడంతో తీవ్రంగా నష్టపోయేవారన్నారు. కానీ, ప్రస్తుతం అమలు చేస్తున్న కేజ్ కల్చర్ విధానం ద్వారా ఒక బాక్స్‌లో 6వేల చేప పిల్లలు వేస్తే ఆ మొత్తం పెరగడం జరుగుతుందని, 9మాసాల్లోనే ఒక్కో చేప కేజీ బరువు అవుతుందన్నారు. ఇలా ఒక్క జానకంపేట్ చెరువులో ఏర్పాటు చేసిన 24బాక్స్‌లలో 6వేల చొప్పున లక్షా 44వేల చేపలు పెంచడం జరిగిందని, కిలోకు 100రూపాయలకు విక్రయించినా కోటీ 40లక్షల రూపాయల ఆదాయం మత్స్యకారులకు చేకూరుతుందన్నారు. పెంచిన చేపలను మధ్యదళారులకు కట్టబెట్టకుండా, తమకు ఇష్టమైన చోట, ఇష్టమైన ధరకు మత్స్యకారులు విక్రయించుకునేలా ఉత్తర్వులు సైతం జారీ చేయడం జరిగిందన్నారు. చేపలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకునేందుకు వీలుగా ఆటోరిక్షాలు, ద్విచక్ర వాహనాలు, మోపెడ్ వాహనాలను సైతం సబ్సిడీపై అందించినట్లు మంత్రి వెల్లడించారు. ఇలాంటి అవకాశాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్‌లో ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారి దశరథ్, బోధన్ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్, తహశీల్దార్ గఫార్‌మియా, మత్స్య శాఖ అదనపు సంచాలకులు మహిపాల్, ఉద్యానవన శాఖ డిడి సునంద, మత్స్యకార్మిక సంఘం నాయకులు సాయిబాబా, పోతన్న, గంగాధర్, తెరాస నాయకులు పురం సాయిలు, శేఖర్‌రాజ్, రాంబాబు పాల్గొన్నారు.