నిజామాబాద్

కుల ప్రస్తావన అర్థరహితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచారెడ్డి, మే 19: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కుల ప్రస్తావన తేవడం అర్థరహితమని కలెక్టర్ యోగితా రాణా అన్నారు. మండలంలోని మంథని దేవునిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం మానవ వనురుల అభివృద్ధి ప్రణాళిక అమలుపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఈ సందర్భంగా మార్పు, అమ్మ ఒడి కార్యక్రమం అమలుపై చర్చ కొనసాగింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తోన్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు భుజించడం లేదని కలెక్టర్ దృష్టికి గ్రామస్థులు తీసుకువచ్చారు. దీంతో ఎందుకు అని ఆరా తీయగా దళితులు వంట చేస్తున్నారనే కారణం చెప్పారు. మనం పాలు తాగుతున్నాం అవి ఏ కులం వారివి. నేను కూడా దళిత వర్గం నుంచే కలెక్టర్‌గా వచ్చాను. నేను చెప్పిన మాటను మీరు వింటున్నారుగా.. మీరు ఆస్పత్రులకు వెళితే వైద్యానికి ముందు వైద్యుడిని ఏకులానికి చెందిన వారని అడుగుతారా అని ప్రశ్నించారు. మానవత్వం ముఖ్యం. కాని కులం, మతం పేరుతో అభివృద్ధిని దూరం చేసుకోవడం మాత్రం సహించరాని విషయంగా పరిగణించారు. అందులో ప్రభుత్వ పథకాల అమలులో మాత్రం ప్రస్తావించకూడదన్నారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటును దూరం చేయడానికి మాత్రమే కులం ప్రాతిపాదికన కొన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయాన్ని దీనికి సాకుగా చూపడం సరైన విషయం కాదని ఆమె వివరించారు.