నిజామాబాద్

గూడులేని పేదలకు ఇళ్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీర్కూర్, మే 30: బీర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామంలో గూడు లేని నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంతో లబ్ధి చేకూరుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంలో భాగంగా సోమవారం ఆయన మండలంలోని బైరాపూర్ గ్రామంలో ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అంతకు ముందు రెండు పడకల ఇళ్ల నిర్మాణాలపై మంత్రి మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 65వేల ఇళ్ల నిర్మాణానికి గాను 4000కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే ఇళ్ల నిర్మాణాలకు 5.40లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 5.30లక్షల రూపాయాలతో అన్ని హంగులతో కూడిన ఇంటి నిర్మాణాన్ని నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాలు మంజూరైన లబ్ధిదారులు ఇందుకోసం ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో 7,665మంది లబ్ధిదారులకు 476కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు వారివారి అనుచరులు ఒక్కో ఇంటికి పదేసి పేర్లు పెట్టుకుని ఇళ్లు నిర్మించుకున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో అర్హులకే చోటు కల్పించాలని, అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులపై క్రిమినల్ కేసులు తప్పవని మంత్రి హెచ్చరించారు. అనంతరం బీర్కూర్ అంకస్‌గాన్ చెరువులో చేపట్టిన మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బైరాపూర్ సర్పంచ్ సుభాష్, ఎంపిపి మల్లెల మీనా హన్మంతు, జడ్పీటిసి కిషన్‌నాయక్, బీర్కూర్ ఎఎంసి చైర్మన్ పెర్క శ్రీనివాస్, హౌజింగ్ పిడి చైతన్యకుమార్, ఎంపిడిఓ భరత్‌కుమార్, మాజీ జడ్పీటిసి సతీష్, తెరాస నాయకులు అశోక్, పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్యామల, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.