నిజామాబాద్

కోదండరాం విమర్శలు అర్ధరహితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జూన్ 7: ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ప్రొఫెసర్ కోదండరాం విమర్శలు చేయడం అర్ధరహితమని, అసలు ఆయన ఆరోపణల వెనుక ఎవరున్నారో తెలుపాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి పోరాటాన్ని ముందుకు నడిపించేందుకు ప్రొఫెసర్ కోదండరాం పేరును ప్రతిపాదించడం జరిగిందని, దాంతో ఆయన పొలిటికల్ జెఎసి చైర్మన్ అయ్యారని ఆయన గుర్తు చేశారు.
టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ప్రొఫెసర్ కోదండరాం వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చాక పొలిటికల్ జెఎసి లేనేలేదని, కానీ, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. గత ప్రభుత్వాలు దశాబ్దాల కాలంలో చేయలేనటువంటి అభివృద్ధిని సిఎం కెసిఆర్ గడిచిన రెండు సంవత్సరాల కాల వ్యవధిలో చేసి చూపించడం జరిగిందన్నారు. అలాంటి తమ అధినేతను విమర్శించడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని ఆయన పేర్కొన్నారు. ప్రొఫెసర్ కోదండరాం తన వ్యాఖ్యలతో కళ్లు ఉన్న కబోదీలా వ్యవహరిస్తున్నారని, జెఎసి పేరిట కెసిఆర్‌పై విమర్శలు చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రొఫెసర్ కోదండరాం తన తీరును మార్చుకోవాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్ నాయకులు ఎఎస్.పోశెట్టి, రవీందర్‌రెడ్డి, దాదన్నగారి విఠల్‌రావు పాల్గొన్నారు.