నిజామాబాద్

కులవృత్తులకు ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 13: కుల వృత్తుల్లో కొనసాగుతున్న వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర పాడి పరిశ్రమ, పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే తోడ్పాటును సద్వినియోగం చేసుకుని చేతివృత్తుల వారు ఆర్థికాభివృద్ధి దిశగా పయనించాలని ఆయన ఆకాంక్షించారు. సోమవారం నిజామాబాద్ జిల్లాకు హాజరైన మంత్రి తలసాని, ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. జిల్లా సరిహద్దు ప్రాంతమైన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో గొర్రెల పెంపకందార్లను కలిసి వారి సాధకబాధకాల గురించి అడిగి తెలుసుకున్నారు. డిచ్‌పల్లి మండలం రాంపూర్‌లో గొర్రెలు, మేకల బ్రీడింగ్ ఫాంను సందర్శించి, వాటి పెంపకానికి చేపడుతున్న చర్యలను పరిశీలించారు. కామారెడ్డిలో నూతనంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి వ్యాధి నిర్ధారణ కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య భవనంలో పశు పోషకులకు పశువుల దాణాను సబ్సిడీపై అందజేశారు. అనంతరం జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎడపల్లి మండలం జానకంపేటలోని అశోక్‌సాగర్‌లో కేజ్ కల్చర్ విధానం ద్వారా చేపడుతున్న చేపల పెంపకాన్న మంత్రి తలసాని పరిశీలించి మత్స్యకారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, చేతివృత్తిదారులకు పూర్తిస్థాయిలో అండగా నిలువాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వారి సంక్షేమానికి పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోందన్నారు. ఇందులో భాగంగానే గొర్రెలు, మేకల పెంపకందారుల సంక్షేమానికి 398కోట్ల రూపాయలను కేటాయించిందని వివరించారు. ప్రతి నియోజకవర్గానికి 20కోట్ల రూపాయలతో పశువైద్య సంచార వాహనాలను కేటాయించనున్నామని తెలిపారు. వెటర్నరీ డాక్టర్ల పోలీసులను టిఎస్‌పిఎస్‌సి ద్వారా భర్తీ చేయనున్నామని, గొర్రెలు, మేకల పెంపకందార్లు అటవీ ప్రాంతంలో సంచరించాల్సి వస్తున్నందున వారికి ఐదు లక్షల బీమా సదుపాయం కల్పించే దిశగా ఆలోచనలు చేస్తున్నామని అన్నారు. పాలు సరఫరా చేస్తున్న రైతులకు ప్రతి లీటరుకు నాలుగు రూపాయల చొప్పున అదనపు ఇనె్సంటివ్ చెల్లించేలా 100కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. విజయ డెయిరీ అవుట్ లెట్లను రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పుతామన్నారు. కుల వృత్తుల వారు స్థానికంగానే అభివృద్ధి చెందేలా వారికి వౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తూ, వారు ఉత్పత్తి చేసే వాటికి తగిన డిమాండ్ కల్పించాలన్నదే ప్రభుత్వ అభిమతమని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఏ ప్రాంతమైనా త్వరితగతిన అభివృద్ధి సాధించాలంటే విద్యుత్, సాగు, తాగునీటి రంగాలు అత్యంత కీలకమైనందున వీటికి తెరాస ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సమీప భవిష్యత్తులోనే సేద్యపు రంగానికి కూడా 24గంటల పాటు విద్యుత్‌ను అందించే స్థాయికి రాష్ట్రం ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్ విషయంలో ముఖ్యమంత్రి ఎంతో ప్రత్యేక చొరవ చూపుతూ మిగులు విద్యుత్ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. కాగా, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బలోపేతం చేయడం వల్ల అటు సాగు, తాగునీటి అవసరాలకే కాకుండా చేపల పెంపకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు, దుస్తులు ఉతికేందుకు వెసులుబాటు ఏర్పడి రజకులకు ఎంతో ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా శుద్ధి చేయబడిన తాగునీటిని అందించేందుకు సుమారు 40వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కెజీ టు పిజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తోందని, ఇందులో భాగంగానే పెద్దఎత్తున గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఎన్‌సిడిసి కింద ప్రభుత్వమే పూచీకత్తు ఇచ్చి కేంద్రం నుండి 8కోట్ల రూపాయలను విడుదల చేయించుకుందని తెలిపారు. ఇదిలాఉండగా, జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎడపల్లి మండలంలోని జానకంపేటలో గల అశోక్‌సాగర్ వద్ద కేజ్ కల్చర్ విధానం ద్వారా చేపడుతున్న చేపల పెంపకం కేంద్రాన్ని మంత్రి తలసాని పరిశీలించి మత్స్యకారులతో కొద్దిసేపు భేటీ అయ్యారు. కేజ్ కల్చర్‌ను మరింతగా విస్తరిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి వెంట ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌గుప్తా, జడ్పీ చైర్మన్ దఫేదార్‌రాజు, నగర మేయర్ ఆకుల సుజాత, ఆర్డీఓలు శ్యాంప్రసాద్‌లాల్, యాదిరెడ్డి, పశు సంవర్ధక శాఖ సంచాలకులు వెంకటేశ్వర్లు, డైరీ ఎండి నిర్మల పాల్గొన్నారు.