నిజామాబాద్

హైకోర్టు విషయంలో.. సిఎం స్పందనేది..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జూన్ 14: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే హైకోర్టు విషయంలో న్యాయవాదులు ఆందోళనలు చేస్తుంటే, సిఎం కెసిఆర్ ఎందుకు స్పందించడం లేదని టి.పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ ప్రశ్నించారు. మంగళవారం నగరంలోని డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ సమయంలో న్యాయవాదుల ఆందోళనలను పవిత్రమైనవిగా కొనియాడిన కెసిఆర్, ప్రస్తుతం ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ప్రస్తుతం టిఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయినా, హైకోర్టు ఏర్పాటు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు ఢిల్లీకి వెళ్లడం జరిగిందని, అందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద్‌గౌడ్ స్పందిస్తూ కొన్నికొన్ని పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలను సత్వరమే తీసుకోలేమని చెప్పడం జరిగిందన్నారు. అందుకే సిఎం కెసిఆర్ హైకోర్టు విషయంలో నోరు మెదపడం లేదన్నారు. తెలంగాణలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు గడిచిన 10రోజులుగా ఆందోళనలు చేస్తున్నందున, వీరికి హైకోర్టు ఏర్పాటు విషయంలో సిఎం కెసిఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఉమ్మడి హైకోర్టులో 44మంది న్యాయమూర్తులకు గాను 22మందియే జడ్జీలు ఉన్నారని, అందులోనూ ఇద్దరు మాత్రమే తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు ఉన్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడినా హైకోర్టు విషయంలో తెలంగాణ న్యాయవాదులకు తీవ్ర వివక్షత ఎదురవుతునే ఉందని, ఉమ్మడి హైకోర్టులో పెత్తనం, పరిపాలనా మొత్తం ఆంధ్రప్రాంత న్యాయమూర్తులదే కొనసాగుతోందన్నారు. తెలంగాణ న్యాయవాదులు ఆందోళనలు చేస్తున్నారని కాబట్టి రాష్ట్ర హైకోర్టును విభజించే చర్యలను భారత ప్రధాన న్యాయమూర్తి చేపట్టాలని కోరారు. అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణను సైతం విభజించాలని, లేదంటే రాజీనామా చేయాలన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే న్యాయవాదుల సంక్షేమానికి 100కోట్లు ఖర్చు చేస్తానని హామీ ఇచ్చిన సిఎం కెసిఆర్, రెండేళ్లు గడుస్తున్నా ఆ నిధులను మంజూరీ చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణలోని 10జిల్లాల న్యాయవాదులు ఛలో హైదరాబాద్ చేపడితే సిఎం కెసిఆర్ పోలీసులను ఉసిగొల్పి లాఠీలు ఝుళిపించడంతో పాటు అరెస్ట్ చేయించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ పదవిలో ఉంటే ఒక మాట, లేకుంటే మరో మాట్లాడటం శోచనీయమని విమర్శించారు. ప్రొఫెసర్ కోదండరాం, టిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని పేర్కొంటే, మంత్రులు, ఎంపిలు ఎందుకు ఉలిక్కిపడ్డారో ప్రజలకు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నగేష్‌రెడ్డి, ముప్ప గంగారెడ్డి, మీసాల సుధాకర్, సుమీర్ అహ్మద్, బుజ్జి తదితరులు ఉన్నారు.