నిజామాబాద్

పథకాలను వినియోగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి రూరల్, జూన్ 14: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామంలోని ఊర చెరువులో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. అలాగే నూతనంగా 13లక్షల నిధులతో నిర్మించ తలపెట్టిన జిపి భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. 7.50లక్షలతో గోపాలమిత్ర భవన నిర్మాణాన్ని, సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చెరువులకు కాకతీయుల నాటి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. గత ప్రభుత్వాల వల్లే గ్రామాల్లో నీటి సమస్య ఏర్పడిందని తెలిపారు. మిషన్ కాకతీయతో చెరువులు నిండితే రైతులకు బతుకులు బాగు పడుతాయన్నారు.
మిషన్ కాకతీయ పథకం కింద రాష్ట్రంలో 46వేల చెరువులను పునరుద్దరించినట్లు తెలిపారు. చెరువుల శిఖం భూములు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే కబ్జాకు గురి అవుతున్నాయని, ఇప్పుడు సర్వే చేయించి చెరువులు కబ్జాకు గురి కాకుండా చూస్తామన్నారు. కరువుతో రెండు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నామని, చెట్లు లేకపోవడం వల్లే వర్షాలు పడడం లేదన్నారు.