నిజామాబాద్

ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు స్థల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి రూరల్, జూన్ 14: కామారెడ్డి నూతన జిల్లాగా ఏర్పాటు కానునందున జిల్లా కలెక్టర్ యోగితారాణా, జెసి రవిందర్‌రెడ్డి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకై స్థలాలను పరిశీలించారు. మంగళవారం అడ్లూర్ గ్రామ శివారులోని 68ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. కొత్తగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలకై నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించారు. అలాగే కామారెడ్డిలో కలెక్టర్ కార్యాలయం, క్యాంపు ఆఫీస్, సంక్షేమ, కార్పొరేషన్ కార్యాలయాల వసతులకై అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం డిప్యూటి డిఇఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్పంచ్‌లు, ఇజిఎస్ సిబ్బందితో మాట్లాడారు. ప్రతి గ్రామంలో 14రకాల కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కనీస 3కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసుకోవచ్చన్నారు. హరితహారం పథకంలో భాగంగా ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, స్మశానవాటికలు, డంపింగ్ యార్డులను పూర్తి చేయడానికి సర్పంచ్‌లు చొరవ చూపాలన్నారు. విద్యార్థులు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాల్సిన బాధ్యత సర్పంచ్‌లపై ఉందన్నారు. ప్రతి గ్రామంలో 40వేలు, ప్రతి ఇంటికి 5మొక్కలను నాటించాలన్నారు. వీటికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి వెంకటేశ్వర్లు, డిఎఫ్‌ఓ సుజాత, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఇజిఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.