నిజామాబాద్

గుమ్మిర్యాల ఎత్తిపోతలకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, జూన్ 16: దశాబ్దాలుగా మోర్తాడ్ మండలం గుమ్మిర్యాల గ్రామ గ్రామస్థులు కంటున్న కలకు నేడు సాక్షాత్కారం ఏర్పడనుంది. 13కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న గుమ్మిర్యాల్ ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శుక్రవారం భూమిపూజ చేయనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాల్వ 19వ డిస్ట్రిబ్యూటరీకి చివరి ఆయకట్టు గ్రామంగా ఉన్న గుమ్మిర్యాల రైతులు మొదటి నుండి కూడా సాగునీటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తలాబున సముద్రం ఉన్నా తాగేందుకు గుట్కెడు నీళ్లు కరవు అన్న చందంగా రైతుల పరిస్థితి తయారైంది. ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూటరీ కాల్వలు గ్రామానికి అందుబాటులో ఉన్నప్పటికీ, ఏనాడు కూడా పంట పొలాలకు నీరందిన దాఖలాలు లేవు. డిస్ట్రిబ్యూటరీ కాల్వల ఆధునీకరణ సమయంలో కూడా గుమ్మిర్యాల రైతులు ఇదే విషయాన్ని మొరపెట్టుకున్నారు. తమ గ్రామ సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ప్రక్కనే ఉన్న గోదావరి నుండి ఎత్తిపోతల పథకం చేపట్టడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. దాదాపు రెండు పర్యాయాలు సర్వే చేయించి, ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. గ్రామానికి ఆనుకుని ప్రవహించే గోదావరి నదిలోనే రైతులు పొక్లెయినర్ల సహాయంతో గుంతలు తీసుకుని, ఊరిన నీటినే పైప్‌లైన్ల ద్వారా మళ్లించుకుంటూ పంటలు పండిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎత్తిపోతలు చేపట్టడం ద్వారే తమ గ్రామ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావించిన గ్రామస్థులు, గుమ్మిర్యాలకు వచ్చిన అమాత్యులకు వినతిపత్రాలు ఇస్తూనే వచ్చారు. సంవత్సరం క్రితం స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి గుమ్మిర్యాల ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక సర్వే చేయించి, ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రెండు మాసాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం గుమ్మిర్యాల ఎత్తిపోతల పథకానికి 13కోట్ల రూపాయలు మంజూరీ చేస్తూ ఆమోదం తెలిపింది. దీంతో గ్రామస్థుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. చిరకాలంగా కోరుతూ వచ్చిన ఎత్తిపోతల పథకం మంజూరీ కావడంతో ప్రభుత్వానికి కృతజ్ఞతగా గ్రామస్థులంతా ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. రాబోయే కాలంలో తెరాసకు పూర్తిగా అండగా ఉంటామని, ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఆ పార్టీకే మద్దతు పలుకుతామని పేర్కొంటూ గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేసి, ఆ కాపీని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి అందజేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. శుక్రవారం మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా ఎత్తిపోతల పథకానికి భూమిపూజ చేసేందుకు గ్రామస్థులు ఆర్భాటంగా ఏర్పాట్లు చేస్తున్నారు.