నిజామాబాద్

వెనక్కి తగ్గేవరకు ఉద్యమం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జూన్ 16: ఆంధ్ర ప్రాంత న్యాయమూర్తుల ఆఫ్షన్‌ను వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమం ఆగబోదని, ఉద్యమం మరింత ఉద్ధృతం అవుతుందని కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిద్దిరాములు అన్నారు. గురువారం న్యాయవాదుల రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు 11వ రోజు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా కోర్టు ఆవరణలో వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడే న్యాయవాదుల భోజనాలు చేశారు. అంతకు ముందుక కోర్టుకు న్యాయమూర్తి, సిబ్బంది, కక్షిదారులు రాకుండా కోర్టు గేట్‌కు తాళం వేసి ఆందోళన చేపట్టారు. కోర్టు ముందు న్యాయవాదులు నినాదాలు చేస్తు, సిబ్బందిని, కక్షిదారులను లోపలకి వెళ్లకుండా అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితితో పాటు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో కక్షిదారులు ఇబ్బందులకు గురి అయ్యారు. దాదాపు గత పదిరోజులుగా న్యాయవాదుల ఆందోళన కార్యక్రమాలతో కోర్టులో సేవలు స్తంభించిపోతున్నాయి. ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న బార్ అసోసియోషన్ అధ్యక్షుడు సిద్దిరాములు మాట్లాడుతూ, తమ న్యాయమైన డిమాండ్ కోసం చేస్తున్న ఆందోళనకు పలు సంఘాల మద్దతు సైతం లభిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై తమ ఈ పోరాటంలో విజయం సాధిస్తామన్న ధీమా తమకు ఉందని అన్నారు. ఆనాడు తెలంగాణను సాధించుకోవడంలో చేసిన పోరాటంలో న్యాయవాదుల పాత్ర ఎంతో ప్రజలందరికి తెలుసని, నాటి పోరాట ప్రతిమను ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగాలని చేస్తున్న ఈ ఆందోళనను మరింత ఉద్ధృతం చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ సాధించుకున్న తరువాత ఇంకా ఆంధ్రా ప్రాంతాలకు చెందిన న్యాయమూర్తులకు ఆఫ్షన్‌లు ఇవ్వడం సరైన పద్దతి కాదని అన్నారు. వెంటనే ఆంధ్రాప్రాంతాల న్యాయమూర్తుల ఆఫ్షన్‌లు వెనక్కు ఈసుకోవాలింటు వంటవార్పు నిర్వహించి ఆందోళన చేపట్టామని అన్నారు. కక్షిదారులకు, సిబ్బందికి ఇబ్బంది కల్గించాలన్న తమ ఉద్ధెశ్యం కాదని, తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం కోసం తప్పని సరి పరిస్థితుల్లో తాము ఆందోళన చేపట్టక తప్పడం లేదని అన్నారు. ఈకార్యక్రమంలో న్యాయవాదుల ప్రతినిదులు, సభ్యులు బి.నారాయణ, విఎల్.నర్సింహారెడ్డి, టి.నరేందర్‌రెడ్డి, శ్యాంగోపాల్‌రావు, చింతలగోపి, లక్ష్మణ్‌రావు, రాజబాబు, శ్రీ్ధర్, వేణుగోపాల్, గోవింద్‌రావు, గంగాధర్, ఎం.రాజు, డి.సురేష్, జగన్నాధం, శంకర్‌రెడ్డి, రషీద్, దామోదర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, సిహెచ్.గోపాల్, శేషు, శ్రీనివాస్, రమేష్ తదితరులు ఉన్నారు.
న్యాయవాదులకు కామారెడ్డి జెఎసి సంఘీభావం
కామారెడ్డి పట్టణంలో ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు కామారెడ్డి డాక్టర్స్ జెఎసి గురువారం తమ సంఘీభావం తెల్పింది. జెఎసి కన్వీనర్ డాక్టర్. రమేష్‌బాబు మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పరాయి న్యాయమూర్తులను ఇక్కడ అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. కాబట్టి న్యాయవాదుల చేస్తున్న ఆందోళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఆంధ్ర న్యాయమూర్తుల ఆఫ్షన్‌లను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కామారెడ్డి పట్టణంలో ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు న్యూ డెమోక్రమసీ నేతలు గురువారం తమ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా న్యూడమోక్రసీ నాయకుడు కట్ల భూమన్న మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతంలోని న్యాయవాదులు చేస్తున్న పోరాటం న్యాయమైందని, కాబట్టి వారికి తమ పూర్తి మద్దతును ఇస్తు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
ఉపాధ్యాయ సంఘం పిడిఎస్‌యుల మద్ధతు
కామారెడ్డి పట్టణంలో ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు గురువారం ఉపాధ్యాయ సంఘం నాయకులు, పిడిఎస్‌యు నాయకులు సంఘీభావం ప్రకటించారు. దీక్ష శిబిరం వద్దకు వచ్చిన ఉపాధ్యాయ సంఘం నేతలు దానయ్య, పిడిఎస్‌యు నాయకులు ఆజాద్‌లు మాట్లాడుతూ, న్యాయవాదులు చేస్తున్న న్యాయ పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఇక ఆంధ్ర పెత్తనం సాగనివ్వకూడదన్నారు. ఆంధ్ర ప్రాంత న్యాయమూర్తుల ఆఫ్షన్‌లను వెనక్కి తీసుకోవడమే న్యాయమన్నారు.