నిజామాబాద్

నిజాంసుగర్స్ ఎవరి చేతిలో ఉన్నట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, మార్చి 17: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 2002 నుండి నిర్వహించబడుతున్న నిజాంచక్కెర కర్మాగారాలు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు ఈ కర్మాగారాలలో పనిచేసే కార్మికులకు ప్రతీ నెలా వేతనాలు చెల్లించిన డేల్టా యాజమాన్యం ప్రస్తుతం చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. కర్మాగారంలో లే ఆఫ్ నోటీసు వేసిన యాజమాన్యం డిసెంబర్ 22 వరకే తాము బాధ్యులమంటూ కార్మికులకు అప్పటి వరకు మాత్రమే వేతనాలు చెల్లించి చేతులు దులుపుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి. లే ఆఫ్ నోటీసు వేసిన తర్వాత యాజమాన్యం కనిపించకుండా పోవడంతో కార్మికులు నిరవధిక ఆందోళనలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నాటి నుండి నేటి వరకు ఇక్కడ కార్మికుల ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.పెండింగ్‌లో ఉన్నటువంటి వేతనాలు వెంటనే కార్మికులకు చెల్లించాలని గత నెల రోజుల క్రితం కార్మిక శాఖ ఉన్నత స్థాయి అధికారుల వద్ద జరిగిన సమావేశంలో కార్మిక శాఖాధికారులు యాజమాన్యాన్ని ఆదేశించారు. ఇందులో లే ఆఫ్ ఎత్తివేత గురించి చర్చకు రాగా యాజమాన్యం మార్చి 16న జరిగే సమావేశంలో స్పష్టతనిస్తామని అధికారులకు తెలియచేసింది. ఆ లోపు కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలన్నింటిని ఇవ్వడం జరుగుతుందని హామీ కూడా ఇచ్చింది. ఈ హామీ ప్రకారం యాజమాన్యం గత రెండు రోజుల క్రితం కార్మికులకు వేతనాలు చెల్లించింది. వీరికి ఫిబ్రవరి వరకు వేతనాలు రావాల్సి ఉండగా యాజమాన్యం కేవలం డిసెంబర్ 22 వరకు మాత్రమే వేతనాలు చెల్లించింది. ఆ తర్వాత వేతనాలను చెల్లించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మిగిలిన రెండు మాసాలకు సంబంధించిన వేతనాలు, డిసెంబర్ మాసంలోని తొమ్మిది రోజులకు సంబంధించిన వేతనాలు ఎందుకు చెల్లించలేదో అంతుచిక్కడం లేదు. ఈ కర్మాగారంలో మొత్తం 134 మంది పర్మనెంట్ కార్మికులు పనిచేస్తున్నారు. మొదటగా కాంట్రాక్టు, ఇతర ఏజన్సీల ద్వారా పనిచేస్తున్న కార్మికులను దశలవారీగా తొలగించిన యాజమాన్యం గత ఏడాది డిసెంబర్ 22 అర్ధరాత్రి తర్వాత కర్మాగారం నోటీసు బోర్డుపై లే ఆఫ్ నోటీసు వేసింది. దీనిని దృష్టిలో పెట్టుకునే యాజమాన్యం కార్మికులకు డిసెంబర్ 22 వరకు వేతనాలు చెల్లించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేక పోవడంతో పూర్తి స్థాయి వేతనాలు యాజమాన్యమే చెల్లించాల్సి ఉంటుందని కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ డెల్టా యాజమాన్యం డిసెంబర్ 22 వరకు మాత్రమే వేతనాలు ఇవ్వడంతో ఈ కర్మాగారాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయని కార్మిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నిజాంసుగర్స్ సంస్థలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్కడా అథికారికంగా ప్రకటించలేక పోయింది. గత రెండు రోజుల క్రితం శాసనసభలో సైతం బోధన్ నియోజకవర్గ శాసనసభ్యుడు షకీల్ అహ్మద్ సైతం కార్మికుల వేతనాల అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించి ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ప్రస్తుతం కర్మాగారాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్యామ్యం నడుమనే ఉన్నప్పటికీ కేవలం డిసెంబర్ 22 వరకు మాత్రమే వేతనాలు ఎందుకు చెల్లించారని వారు పేర్కొంటున్నారు. లే ఆఫ్ నోటీసు వేసినా వేతనాలు చెల్లించాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మికులు కోరుతున్నారు.