నిజామాబాద్

పసుపు సాగులో తెలంగాణదే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటగిరి, జూన్ 23: భారతదేశంలో పసుపు పంటను అధిక మొత్తంలో పండించడంలో తెలంగాణ రాష్టమ్రే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కోటగిరి మండలం ఎత్తొండ క్యాంప్ గ్రామం లో పసుపు ప్రథమ శ్రేణి క్షేత్రాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు. ఎత్తొండ క్యాంప్ శివార్లలోని 20ఎకరాల్లో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పసుపు పంటను సాగు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఆ పంట భూమిని పరిశీలించిన మంత్రి, పంట సాగు చేస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ, పసుపు పండించడంలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలు భారతదేశంలోనే మొదటిస్థానంలో ఉన్నాయని అన్నారు. పసుపు పండించే రైతులకు 50శాతం సబ్సిడీతో విత్తనాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ విత్తనాలు పండించిన రైతు ఎకరానికి 40నుండి 50క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చని అన్నారు. క్వింటాలుకు 12వేల రూపాయలు లభించినా, అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. ఈ పంట దిగుబడులు వచ్చిన తర్వాత ఇతర రైతులకు విత్తనాలుగా ఉపయోగించవచ్చని అన్నారు. అదే పసుపు పంటకు డ్రిప్ ఇరిగేషన్ కింద ఎస్సీ, ఎస్టీలకు 100శాతం, బిసిలకు 90శాతం, సన్నచిన్నకారు రైతులకు 80శాతం సబ్సిడీ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సులోచన, జడ్పీటిసి శంకర్, శ్రీనివాస్‌రావు, గంగాధర్ తదితరులు ఉన్నారు.