నిజామాబాద్

ఎస్‌ఐ అభ్యర్థులకు ముగిసిన దేహదారుఢ్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, జూలై 3: తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సబ్-ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ అభ్యర్థుల ఎంపికలో భాగంగా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ముగియడం జరిగిందని జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ తెలిపారు. చివరి రోజైన ఆదివారం ఉదయం 5గంటల నుండి ప్రారంభమైన ఈ పరీక్షలు సాయంత్రం వరకు నిర్వహించడం జరిగిందన్నారు. జూన్ 27న ప్రారంభమైన ఈ పరీక్షలకు మొత్తం 3,587మంది అభ్యర్థులను పిలువగా, అందులో ఫిమేల్ విభాగంలో 100మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్, షాట్‌ఫుట్ విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో 252మంది మాత్రమే మూడు ఇవెంట్స్‌లో అర్హత సాధించడం జరిగిందని తెలిపారు. అలాగే పురుషులకు 100మి, 800మీటర్ల పరుగుపందెం, హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్ విభాగాల్లో పోటీలు నిర్వహించగా, 1058మంది ఎంపిక కావడం జరిగిందన్నారు. మైనార్టీ అభ్యర్థులకు రంజాన్ ఉపవాస దీక్షలు ఉండటం వల్ల జూలై 9వ తేదీన దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాలని ఎస్పీ సూచించారు. ఎస్‌ఐ ఎంపికలు పూర్తి పారదర్శకంగా, ప్రశాంతంగా జరుగుతున్నాయని అన్నారు. పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు చెప్పే మాయమాటలు అభ్యర్థులు మోసపోవద్దని ఎస్పీ కోరారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వెంటనే 9440795400కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, అలాంటి వారి వివరాలను గోప్యంగా ఉంచబడుతాయన్నారు. ఎస్‌ఐ అభ్యర్థుల ఎంపిక సమయంలో ఎఎస్‌పి ఆర్.ప్రతాప్‌రెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఎన్‌బిఐ, జిల్లా పోలీసు కేంద్రం, ఎఆర్ డిఎస్పీలు ఆనంద్‌కుమార్, ఎ.్భస్కర్, ఆర్.వెంకటేశ్వర్లు, జి.రవీందర్, కె.మోహన్, సయ్యద్ అన్వర్ హుస్సేన్‌తో పాటు అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.