నిజామాబాద్

విపత్తుల నివారణకు సన్నద్ధతే కీలకపాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి రూరల్, జూలై 5: విపత్తులు సంభవించిన సమయంలో అవలంభించాల్సిన పద్ధతుల గురించి తెలియజేసేందుకు మంగళవారం డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సభ్యులు హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్శిటీ ఇంచార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వై.జయప్రకాశ్‌రావు మాట్లాడుతూ, విపత్తుల నివారణలో ప్రజలందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంటుందన్నారు. విపత్తులపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. విపత్తుల నివారణలో సన్నద్ధతే కీలకపాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. వరదలు, భూకంపాలు, తుపాన్లు వంటి సహజ విపత్తులు, మానవ తప్పిదాలతో ఏర్పడే విపత్తుల కారణంగా వేలాది మంది మృత్యువాత పడుతున్నారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.
జాతీయ విపత్తుల నివారణ సంస్థ ద్వారా ఈ తరహా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ, ఇప్పటికే దేశ వ్యాప్తంగా సుమారు లక్ష మంది విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ పర్వత్‌లాల్ మాట్లాడుతూ, ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. విపత్తుల పట్ల ప్రజలు సరైన అవగాహనతో ఉంటే, ఎంతోమంది ప్రాణాలను కాపడవచ్చని పేర్కొన్నారు. జాతీయ విపత్తుల నివారణ 10వ బెటాలియన్ మంగళగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్శిటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్.ఆర్తి, పిఆర్‌ఓ కె.రాజారాం, డాక్టర్ ఎం.మమత, అధ్యాపకులు ఎం.ప్రవీణ్, లక్ష్మణచక్రవర్తి, రమణాచారితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.