నిజామాబాద్

బీర్కూర్‌ను నిజామాబాద్‌లోనే ఉంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీర్కూర్, జూలై 5: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా బీర్కూర్ మండలాన్ని కామారెడ్డి జిల్లాలో కలుపకుండా, నిజామాబాద్‌లోనే కొనసాగించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ దివిటి శ్రీనివాస్‌యాదవ్ కోరారు. బీర్కూర్‌ను నిజామాబాద్‌లోనే కొనసాగించాలని బీర్కూర్-2 ఎంపిటిసి సభ్యుడు సుధాకర్‌యాదవ్ స్థానిక తహశీల్ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షా శిబిరాన్ని మంగళవారం శ్రీనివాస్‌యాదవ్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ పబ్బం గడుపుకునేందుకే టిఆర్‌ఎస్ నాయకులు పరిపాలన సౌలభ్యం పేరిట నూతన జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం విడ్డూరంగా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి బీర్కూర్ కేవలం 40కిలోమీటర్ల దూరంలో ఉందని, అదే కామారెడ్డి 80కిలోమీటర్ల దూరం ఉంటుందన్నారు. అందువల్ల జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న బీర్కూర్‌ను నిజామాబాద్‌లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక గ్రామ పంచాయతీ ఎదుట శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఆ మేరకు గ్రామ పంచాయతీ గ్రామసభలో తీర్మానం చేయించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీర్కూర్ మాజీ సర్పంచ్ సానెపు గంగారాం, కాంగ్రెస్ నాయకులు లక్ష్మన్‌సింగ్, రాచప్ప, పోతుల వెంకటేశం, ఈరా సాయిలు, ఓంకార్, శివ, రాజ తదితరులు పాల్గొన్నారు.