నిజామాబాద్

20 కోట్లతో రోడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని 63వ నంబర్ జాతీయ రహదారి నుంచి భీమ్‌గల్ మీదుగా ఇందల్వాయి జాతీయ రహదారి 44 వరకు 20 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు వేయడానికి నిధులు మంజూరయ్యాయని మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కమ్మర్‌పల్లి మండలంలో హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్మర్‌పల్లి మార్కెట్ కమిటీ ఆవరణలో, బషీరాబాద్ ఐటిఐ కళాశాల ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బషీరాబాద్ జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కమ్మర్‌పల్లి, మోర్తాడ్, భీమ్‌గల్ మండలాల ప్రజల సౌకర్యం కోసం కమ్మర్‌పల్లి నుంచి ఇందల్వాయి వరకు డబుల్ రోడ్డుకు నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణంతో హైదరాబాద్‌కు వెళ్లే ప్రజలకు దూరభారం తగ్గుతుందని అన్నారు. ప్రతి వ్యక్తి మొక్కలు నాటే కార్యక్రమాన్ని తమ ఇంటి పనిగా చేసుకోవాలని ఆయన సూచించారు. వర్షాలు లేక మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, వరుస కరువు ప్రభావంతో చెరువులు ఎండిపోయి వేసవిలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్న విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు. 100 కోట్లు వెచ్చించినా వర్షాలు రావని, చెట్లతోనే వర్షాలు పడతాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కౌలస్య, జడ్పీటిసి దాసరి లక్ష్మీ, మార్కెట్ కమిటీ చైర్మన్ దొన్కంటి నర్సయ్య, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లుక్క గంగాధర్, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ యాదవ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పార్వతిరాజలింగం, నాయకులు హల్దె శ్రీనివాస్, శ్రీకుమార్, పాల్గొన్నారు.