నిజామాబాద్

శ్రీరాంసాగర్‌కు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, జూలై 11: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరదనీరు క్రమేపి వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, నాందేడ్ జిల్లాల్లో కురిసిన వర్షంతో పాటు గడ్డెన్నవాగు వరద జలాలు తోడు కావడంతో సోమవారం సాయంత్రానికి 15000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఎఇ మహేందర్ తెలిపారు. దీంతో సోమవారం సాయంత్రానికి రిజర్వాయర్ నీటిమట్టం 1050.60అడుగులకు చేరుకుందని, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00అడుగులు కాగా, గత సంవత్సరం ఇదేరోజు రిజర్వాయర్ నీటిమట్టం 1057.60అడుగుల వద్ద నిల్వ ఉన్నట్లు ఎఇ తెలిపారు.