నిజామాబాద్

పచ్చదనంతోనే సమృద్ధిగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ, జూలై 17: దట్టమైన అడవులు కలిగి ఉండి పచ్చదనంతో అలరారే ప్రాంతాల్లోనే సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని, ఈ విషయాన్ని గుర్తెరిగా ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలలో గతేడాదితో పాటు ఈ సంవత్సరం కూడా పెద్దఎత్తున వర్షాలు కురుస్తుండడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పోచారం మాట్లాడుతూ, హరితహారం లక్ష్యానికి మించి మొక్కలు నాటి వాటిని సంరక్షించుకుంటే సమీప భవిష్యత్తులోనే వర్షాల పరంగా పరిస్థితులు ఎంతగానో అనుకూలిస్తాయని, ఫలితంగా కరవు బారి నుండి శాశ్వతంగా బయటపడవచ్చని అన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చెట్లతోనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. చెట్ల వల్ల వాతావరణ సమతుల్యం కాపాడబడి, వర్షాలు సమృద్ధిగా కురిస్తే తాగు, సాగునీటి కొరత తలెత్తకుండా మనమంతా సుభిక్షంగా ఉండవచ్చని, మన భావితరాలకు కూడా మేలు చేసినవారమవుతామని హితవు పలికారు. సోమేశ్వర్ గ్రామస్థులు ఐకమత్యంగా ఉంటూ పెద్దఎత్తున మొక్కలు నాటడం పట్ల మంత్రి పోచారం వారిని అభినందించారు. తాను దత్తత తీసుకున్న ఈ గ్రామంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు పెట్టించుకోవడమే కాకుండా, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడం, ప్రస్తుతం ఇంటింటికి మొక్కలు నాటడం అభినందనీయమని స్థానికులను ప్రశంసించారు. సోమేశ్వర్ గ్రామంలో సి.సి రోడ్ల నిర్మాణాలతో పాటు అన్ని వర్గాల వారికి కమ్యూనిటీ హాళ్ల కోసం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో సొంత ఇల్లు లేని వారితో పాటు గుడిసెల్లో జీవనాలు వెళ్లదీస్తున్న ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు జరిపించి ఇస్తానని అన్నారు.
అంతేకాకుండా గ్రామంలో పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు, దాని భవన నిర్మాణానికై నాలుగు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలోనే దీనిని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి పోచారం తెలిపారు. జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు మాట్లాడుతూ, జిల్లాలో 3.35 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ప్రతీ గ్రామంలో 40 వేల చొప్పున మొక్కలు నాటాలనే ప్రణాళికకు అనుగుణంగా లక్ష్యానికి మించి మొక్కలు నాటాలని ప్రజలను కోరారు. గతంలో వన సంరక్షణ గురించి పట్టించుకోని కారణంగా ప్రస్తుతం వర్షాభావం నెలకొని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, తెరాస జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, డాక్టర్ బాపురెడ్డి, జడ్పీటిసి జంగం విజయ, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అలీముద్దీన్ బాబా, ఎఎంసి చైర్మెన్ నార్ల సురేష్‌గుప్తా, తెరాస నాయకులు కృష్ణారెడ్డి, డాక్టర్ అంజిరెడ్డి, మహ్మద్ ఎజాస్, జంగం గంగాధర్, సర్పంచ్ ఎన్.పద్మ, ఎంపిటిసి సిహెచ్.పద్మ, తహశీల్దార్ సిహెచ్.గోపి, ఎంపిడిఓ విజయ్‌భాస్కర్ పాల్గొన్నారు.