నిజామాబాద్

భావితరాల కోసమే హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి రూరల్, జూలై 18: భావితరాల కోసమే హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా నిర్వహిస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు అన్నారు. సోమవారం మండలంలోని రాఘవపూర్ గ్రామంలో హరితహారంలో భాగంగా ఈత మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని, అదే విధంగా వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నాటిన ప్రతి మొక్క బతికేలా నీరు పోయాలని సూచించారు. వాటి సంరక్షణ కోసం ట్రీగార్డ్‌లు, కంచెలు ఏర్పాటు చేయాలన్నారు. ఈత మొక్కలు పెరిగిన తర్వాత కల్తీకల్లు నుండి విముక్తి కల్గడమే కాకుండా నాణ్యమైన కల్లు అందడంతో పాటు గీత కార్మికులకు ఉపాధి కల్గుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయడం వల్ల భవిష్యత్తు తరాలకు మంచి జీవనాన్ని అందించవచ్చన్నారు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటాలన్నారు. వాతావారణ కాలుష్య నివారణతో పాటు వర్షాలు సమృద్ధిగా కురవాలంటే మొక్కలు నాటాలన్నారు. అలాగే అడవుల శాతం పెంచాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా నిర్వహిస్తున్న హరితహార కార్యక్రమాన్ని లక్ష్యానికి మించి విజయవంతం చేస్తామన్నారు. కామారెడ్డి నియోజక వర్గంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వి.జి గౌడ్, ఐడిసిఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, కామారెడ్డి ఎంపిపి లద్దూరి మంగమ్మలక్ష్మీపతీయాదవ్, భిక్కనూరు జడ్పిటిసి నంద రమేశ్, తదితరులు పాల్గొన్నారు.