నెల్లూరు

మంత్రి ఇల్లు ముట్టడికి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేటటౌన్, మార్చి 18: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌చేస్తూ వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రాష్టవ్య్రాప్తంగా మంత్రుల ఇండ్ల ముట్టడిలో భాగంగా శుక్రవారం పట్టణంలోని రాష్ట్ర విద్యుత్, సహకార, దళిత అభివృద్ది శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ఎస్ ఎఫ్ ఐ, పిడి ఎస్‌యు, ఏ ఐ ఎస్ ఎఫ్, టివివి సంఘాల ఆధ్వర్యంలో ప్రయత్నించగా అక్కడే ఉన్న భారీగా ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్న విద్యార్ధి సంఘాల నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థి సంఘాల నేతలకు తోపులాట జరిగింది. పోలీసులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి ముందస్తు చర్యలు చేపట్టారు. పిడి ఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందూరు సాగర్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చేపూరి కొండలు, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి బత్తుల విద్యాసాగర్, టివివి జిల్లా కార్యదర్శి గుండాల సందీప్‌లను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు ఇచ్చారు. విద్యార్ధి సంఘాల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ ఆయా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించి మంత్రి జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ టి ఆర్ ఎస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల సవతి తల్లి ప్రేమను కనబరుస్తుందన్నారు. మండలానికి ఒక రెసిడెన్షియల్ కళాశాలను ఏర్పాటుచేసి కేజి నుండి పిజి వరకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసి ఆర్ బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారన్నారు. నిధులు తగ్గడంతో ఉచిత విద్య మిద్యగా మారే ప్రమాదం ఉందన్నారు. సమస్యలను ప్రశ్నిస్తున్న నాయకులను బెధిరంపులకు, భయభ్రాంతులకు ప్రభుత్వం గురిచేస్తుందన్నారు. అరెస్ట్ చేసిన విద్యార్థి నాయకులను వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు అఖిల్, బిక్షం, దనియాకుల శ్రీకాంత్‌వర్మ, ఉపేందర్, పరంగి రాము, దేవేందర్, సిరిపంగి నాగరాజు, వీరబోయిన లింగయ్య, గోపి, సందీప్, ఉదయ్, వేణు, అరుణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.