వరంగల్

హరితహారం దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఘునాథపల్లి, జూలై 18: ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా విరివిగా మొక్కలను నాటి హరిత తెలంగాణకు కృషి చేయాలని జడ్పీచైర్‌పర్సన్ గద్దల పద్మ అన్నారు. సోమవారం మండలంలోని మంగళిబండ తండాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా జనగామ డిఎస్పీ పద్మనాభరెడ్డితో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆమె అన్నారు. నాటిన మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వన సంపదతోనే విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆమె తెలిపారు. హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్నారు. ఇండ్ల పరిసరాల్లో, ఖాళీ ప్రదేశాల్లో, రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటాలని ఆమె సూచించారు. తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉద్యమంలా చేపట్టిందని, ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతుండటం అభినందనీయమన్నారు. నాటిన మొక్కలను సంరక్షించుకున్నప్పుడే ఫలితం దక్కుతుందని ఆమె తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులకు హరితహారంపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దాసరి అనిత, జడ్పీటిసి బానోతు శారద, సిఐ తిరుపతి, ఎస్సై రంజిత్‌రావు, ఎంపిడివో బానోతు సరిత, సర్పంచ్ రాజమణి, ఎపివో ప్రేమయ్య, ఇవోపిఆర్‌డి గంగాభవాని, నాయకులు గోపాల్, బిక్షపతినాయక్, తిరుమల్‌నాయక్, బుగ్గయ్య, హుస్సేన్‌నాయక్, కార్యదర్శి ఉమకేష్‌లు పాల్గొన్నారు.