నెల్లూరు

ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు మోదీ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, మార్చి 18: దేశంలో వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి రైతాంగాన్ని ఆదుకునే దిశగా ప్రతి రైతు చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించే లక్ష్యంతో ప్రదాని నరేంద్ర మోదీ అహర్నిశలు పనిచేస్తున్నారని కిసాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసుదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 20నెలల కాలంలో దేశంలో గత ఏ ప్రభుత్వం చేయని విధంగా వ్యవసాయ రంగాన్ని గట్టెకిచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా గత ఏప్రిల్ 1నుండి పంటల నష్టపరిహారాన్ని పెంచారని, ప్రకృతి వైపరీత్యాలతో అతివృష్టి, అనావృష్టి, వడగల్లవానలు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు గత ప్రభుత్వాలు పంటనష్టం 50శాతానికి పైగా ఉంటేనే
నష్టపరిహారం చెల్లించేవని, దాన్ని మోదీ 33శాతం పంట నష్టం జరిగినా నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుని నూతన విధానానికి నాంది పలికిన ఘనత మోదీదేనన్నారు. వ్యక్తి మరణిస్తే 1లక్ష 50వేలు మాత్రమే కుటుంభాన్ని ఆదుకునేందుకు నష్టపరిహారంగా ఇచ్చేవారని, ప్రస్తుతం మోదీ దాన్ని 4లక్షలకు పెంచడం అభినందనీయమన్నారు. గతంలో బ్యాంకు రుణ సౌకర్యారం రైతు భూమినిబట్టి 30శాతమే అందించేవారని ప్రస్తుతం 50శాతానికి పెంచారన్నారు. ప్రధానమంత్రి ఫసల్ భీమాయోజన పథకం ద్వారా పంటల ధరల తగ్గుదల, వ్యవసాయ ఉత్పత్తి, ప్రకృతి వైపదిత్యాలతో నష్టనివారణ చర్యలకై భీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతు కేవలం రెండు శాతం భరిస్తే మిగతా 98శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరించే విధంగా నూతన శకాన్ని ఆరంభించారన్నారు. స్వాతంత్రం వచ్చి 68సంవత్సరాలైనప్పటికి రైతులకు సరైన భీమా సౌకర్యం లేకపోవడం వల్ల, 60సంవత్సరాల కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా రైతులు, వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నదాతలను ఆదుకునేందుకే నరేంద్రమోది రైతాంగానికి రక్షణ కవచంలాంటి పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. గతంలో కొన్ని పంటలకు మాత్రమే ఉన్న పరిమితపు భీమా సౌకర్యాన్ని మోది అన్ని పంటలకు విస్తరించారన్నారు. పత్తివిత్తనాల ధరలను బాగా తగ్గించిన ఘనత బిజెపి ప్రభుత్వానిదేనని, రైతు ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవసాయ ఉత్పత్తిని వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తిని పెంచడం భూసార కార్డులను అందించడం, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునః ప్రారంభం, హార్టికల్చర్ యూనివర్సిటీ, దామరచర్ల యాదాద్రి పవర్‌ప్లాంట్‌లేకాక, సాగునీరు. తాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తూ భద్రాచలం పవర్‌ప్లాంట్‌కు ప్రజాభిప్రాయ సేకరణ సైతం జరపడం రైతాంగం కోసమేనని ప్రతిపక్షాలు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రామోజు షణ్ముఖ, పోతెపాక సాంబయ్య, చేనేత సంఘం వైస్ చైర్మన్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.