నెల్లూరు

ఆసుపత్రి నిర్మాణంలో నాణ్యత డొల్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, మార్చి 18: నాగార్జునసాగర్‌లో ప్రభుత్వ కమలానెహ్రు ఏరియా ఆసుపత్రికి అనుబంధంగా నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవన సముదాయం కోసం వినియోగించే సామాగ్రి నాణ్యతాలోపంగా నిర్మిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాగర్‌లో కమలానెహ్రు ఆసుపత్రి ఆవరణలో గతంలో ఉన్న ఆసుపత్రి సిబ్బంది నివాస గృహాలను తొలగించి కొత్తగా ఆధునీకంగా భవన నిర్మాణాన్ని నాబార్డ్ సంస్థ నిధులతో నిర్మిస్తున్నారు. రూ.18కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రి నిర్మిస్తుండగా దీనిలో రూ.13కోట్లు భవన నిర్మాణానికి, మరో రూ.5కోట్లు ఆసుపత్రి సామాగ్రికి ఖర్చుపెట్టనున్నారు. నెల రోజుల క్రితమే ఎటువంటి హట్టహాసం లేకుండా ఆసుపత్రి భవన నిర్మాణం పనులను అధికారులు ప్రారంభించారు. దీని కోసం ఇప్పటికే అక్కడ ఉన్న నివాస గృహాలను తొలగించి భవన నిర్మాణానికి కావాల్సిన ఐరన్, ఇసుక, సిమెంట్‌ను దిగుమతి చేసుకున్నారు. అయితే నిర్మాణానికి వినియోగిస్తున్న ఇసుక మట్టి, ధూళితో కలిసి నిర్మాణానికి పనికిరాకుండా ఉందని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణానికై హాలియా వాగు నుండి ఇసుకను తీసుకోవడానికి అనుమతి ఉన్నా కూడా కృష్ణానది తీర ప్రాంతంలోని నడిగడ్డ నుండి మట్టిగడ్డలతో ఉన్నటువంటి ఇసుకను తీసుకొచ్చి నిర్మాణ సముదాయం వద్ద గుట్టలుగా పోశారు. దీంతోపాటు భవన నిర్మాణానికి తీసుకొచ్చిన సామాగ్రి సైతం నాణ్యత లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సాగర్ డ్యాం నిర్మాణ సమయంలో నిర్మించిన కమలానెహ్రు ఆసుపత్రి 6దశాబ్ధాలు దాటినా ఎంతో పటిష్టంగా ఉందని, ప్రస్తుతం నిర్మిస్తున్న ఆసుపత్రి సముదాయం నాణ్యతలేని ఇటుక వినియోగించడం ద్వారా భవిష్యత్తులో పరిస్థితి ఏంటని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రూ.18కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి ఒక సైట్ ఇంజనీర్‌ను ఏర్పాటుచేశారు. అక్కడ కూడా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేని కారణంగా అక్కడ పనిచేసేవారే ఇష్టమొచ్చిన రీతిలో పనులు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించిన డిఇ అజీజ్‌ను వివరణ కోరగా తాము ఆసుపత్రి నిర్మాణానికై ప్రభుత్వం నుండి హాలియా వాగు నుండి ఇసుకను తీసుకోని రావడానికి అనుమతి ఉందని కాని స్థానిక కాంట్రాక్టర్లు నడిగడ్డ నుండి ఇసుకను తీసుకొస్తున్నారని ఆయన తెలిపారు. ఇసుక నాణ్యతపై ఆరోపణలు వస్తున్న కారణంగా ఇసుకను టెస్ట్‌కి పంపి నాణ్యత లేనట్లయితే ఆ ఇసుకను నిర్మాణానికి ఉపయోగించమని ఆయన తెలిపారు.