నిజామాబాద్

కల్తీలేని కల్లులు అందించేందుకే గిరకతాళ్ల చెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటగిరి, జూలై 21: ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీకల్లును పూర్తిగా నిరోధించి, ప్రజలకు స్వచ్ఛమైన కల్లును అందించేందుకే ప్రభుత్వం మేలు రకమైన గిరకతాళ్ల చెట్లను నాటిస్తోందన్నారు. దీంతో ప్రజలకు స్వచ్ఛమైన కల్లుతో పాటు గీతకార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. కోటగిరి మండలం రాంపూర్ గ్రామ శివార్లలో గురువారం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గిరకతాళ్ల చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పెద్దఎత్తున గిరకతాళ్ల మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ గిరకతాళ్ల ఒక్కో చెట్టుకు రోజుకు 30నుండి 50లీటర్ల వరకు కల్లు వస్తుందన్నారు. గీత కార్మికులు కనీసం రెండు మొక్కలను నాటికుని పరిరక్షించుకున్నా, రాబోయే రోజుల్లో రోజుకు 1500రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని అన్నారు. వచ్చే సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలోనే గిరికతాళ్ల మొక్కల నర్సరీని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మొక్కలను ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుండి కోటగిరి మండలంలోని గౌడ్ కులస్తులు తీసుకరావడం హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోనే మొదటి సారిగా ఈ మొక్కలను నాటుతున్నామని తెలిపారు. అనంతరం రాంపూర్ రోడ్డును చూసి స్థానిక ఎస్‌ఐ బషీర్ అహ్మద్, సిఐ శ్రీనివాసులను పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై కేజీవీల్స్ ట్రాక్టర్లు యథేచ్ఛగా తిరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
కేజీవీల్స్‌తో వెళ్లే ట్రాక్టర్లు ఎవరివైనా సరే వదిలిపెట్టకుండా కేసులు నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో విఆర్‌ఓలు, విఆర్‌ఎలు కేజీవీల్స్ ట్రాక్టర్లు తిరుగకుండా చూడాలని ఆదేశించారు. రోడ్లపై కేజీవీల్స్ ట్రాక్టర్లు తిరిగితే విఆర్‌ఓలతో పాటు పోలీసులకు వేటు తప్పదని మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీ విజి.గౌడ్, జడ్పీటిసి శంకర్, సర్పంచ్ రెడ్యానాయక్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, డిసిసిబి చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ, గౌడ కులస్తులు గంగాధర్‌గౌడ్, విఠల్‌గౌడ్, రామాగౌడ్, శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ రూరల్ మండలం పరిధిలోని పాంగ్రాలోని ఇవిఎం గోడౌన్స్, నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీ విజి.గౌడ్, కలెక్టర్ యోగితారాణాలు గురువారం మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నాటి ప్రతి ఒక్కకు పెన్సింగ్ ఏర్పాటు చేసి పరిరక్షించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరు భాగస్వామ్యమై నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు చేయూత అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, జెసి రవీందర్‌రెడ్డి, డిఆర్‌ఓ పద్మాకర్, ఆర్డీఓ యాదిరెడ్డి పాల్గొన్నారు.