నిజామాబాద్

వెలవెలబోతున్న ఫిల్టర్‌బెడ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, జూలై 22: భారీ వర్షాలు కురిసినా పెద్దవాగులో వరద ప్రవాహం రాకపోవడంతో ఫిల్టర్‌బెడ్‌లు రీచార్జ్ కాలేదు. దీంతో పెద్దవాగు జలాలపైనే ఆధారపడ్డ చాలామంది రైతులు పంటల సాగు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి పెద్దవాగులో వరద ప్రవాహం వారం రోజుల పాటు కొనసాగితే రెండు సంవత్సరాల వరకు ఎలాంటి డోకా ఉండదని, ఇప్పటి వరకు అలాంటి అవకాశం రాలేదని రైతులు వాపోతున్నారు. భీమ్‌గల్, వేల్పూర్, మోర్తాడ్ మండలాల గుండా ప్రవహించే పెద్దవాగు, మోర్తాడ్ మండలంలోని బట్టాపూర్ వద్ద గోదావరి నదిలో కలుస్తోంది. పెద్దవాగుకు మొండివాగు మత్తడి, ఉడిపివాగు ప్రాజెక్టు, మోతెవాగు తదితర వాగులన్నీ ఉప నదులుగా ఉన్నాయి. రామడుగు ప్రాజెక్టు పొంగిపొర్లితే మిగులు జలాలన్నీ పెద్దవాగులోకే మళ్లుతాయి. అయితే గడిచిన రెండు సంవత్సరాలుగా వరుణుడి కటాక్షం లేక పెద్దవాగు బోయిపోయింది. ముమ్మరంగా సాగుతున్న ఇసుక రవాణా వల్ల కూడా పెద్దవాగు తన స్వరూపాన్ని కోల్పోతోంది. పెద్దవాగుపై ఉన్న ప్రాజెక్టులు కూడా నిండకపోవడంతో వరద జలాలు కనిపించడం లేదు. ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభమైన తర్వాత భారీ వర్షాలు కురిసినప్పటికీ, ఒక్క వాగుకు కూడా జలకళ రాలేదు. దీంతో పెద్దవాగుపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. వాగుకు రెండు వైపులా వందలాది మంది రైతులు పంటలు పండిస్తారు. పెద్దవాగులో ఫిల్టర్‌బెడ్‌లను ఏర్పాటు చేసుకుని పైప్‌లైన్ల ద్వారా నీటిని మళ్లించుకుంటారు. పెద్దవాగులో భూగర్భ జలాలను పెంచేందుకు ప్రభుత్వం కూడా భారీ మొత్తంలోనే నిధులు కేటాయిస్తోంది. అడుగడుగునా లక్షలాది రూపాయల వ్యయంతో సబ్ సర్ఫేజ్ చెక్‌డ్యామ్‌లను ఏర్పాటు చేశారు. తాజాగా ప్రభుత్వం కూడా గాండ్లపేట, శెట్పల్లిల వద్ద చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి కోటి రూపాయల వరకు నిధులు కేటాయించింది. ఇదే పెద్దవాగు భూగర్భ జలాలపై ఆధారపడి 2కోట్ల రూపాయల వ్యయంతో పాలెం, తొర్తి ఎత్తిపోతల పథకాలను చేపట్టారు.
వీటిని బట్టి పెద్దవాగు ఈ ప్రాంత రైతాంగానికి, ఆయా గ్రామాల ప్రజల దాహార్తి తీర్చేందుకు ఎంతగా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే మూడు సంవత్సరాల క్రితం పెద్దవాగులో ఒక్కసారి మాత్రమే వరద ప్రవాహం నిండుగా కనినిపించింది. ఆ తర్వాత పెద్దవాగుకు ఆ జలకళ రానేలేదు. తాజాగా కురుస్తున్న వర్షాల వల్ల వాగుల్లోకి జలాలు రాకపోవడంతో పెద్దవాగు కూడా ఎడారిగానే కనిపిస్తోంది. ప్రాజెక్టులలో పూడిక తొలగించడం, పెద్దవాగుకు ఉప నదిగా ఉన్న మొండివాగులో పెద్దఎత్తున మట్టి తవ్వడం తదితర కారణాల వల్ల వర్షపు జలాలన్నీ ఆ గుంతలకే పరిమితం అవుతున్నాయి. ఏకధాటిగా నాలుగైదు రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే తప్పా, పెద్దవాగుకు, దాని ఉప నదులకు జలకళ వచ్చే అవకాశం కనిపించడం లేదు. మిగతా ప్రాంతాల్లో రైతులు బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చూస్తూ, వరినాట్లు వేస్తున్నప్పటికీ, పెద్దవాగు ఆయకట్టు పరిధిలో మాత్రం ఇంకను ఆ అలికిడి కనిపించడం లేదు. కనీసం మొండివాగు ప్రవహించినా, ఆ జలాలు గాండ్లపేట, పాలెం, తొర్తి తదితర గ్రామాల మధ్య గుండా ప్రవహించే పెద్దవాగులో ఫీల్టర్‌బెడ్‌లకు ఊపిరిపోస్తాయని రైతులు భావిస్తున్నారు.