నిజామాబాద్

మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమ్‌గల్, జూలై 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం భీమ్‌గల్ మండల కేంద్రంలో చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద, ఎంపిడిఓ కార్యాలయం ఆవరణ, కస్తూర్బా పాఠశాల, పోలీస్ స్టేషన్, సొసైటీలలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవాళి మనుగడకు చెట్లే ఆధారమని, చెట్లను పెంచి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలువాలని అన్నారు. అడవులు తగ్గిపోతుండటంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియడం లేదని, తద్వారా కరవు విళయతాండం చేస్తోందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తెరిగి మొక్కలు నాటేందుకు ముందుకు రావాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు గ్రామస్థులు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో 17లక్షలు మొక్కలు నానాటడం లక్ష్యం కాగా, ఇప్పటికే 75శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. భీమ్‌గల్ మండలంలోని 9గ్రామాల్లో 40వేల లక్ష్యాన్ని సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. 100 చెట్లు పెంచేందుకు బాధ్యత తీసుకునే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల రివార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబం కనీసం 10చెట్లు నాటేలా మండల అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యపర్చాలన్నారు. నిజామాబాద్ జిల్లాకు మిషన్ భగీరథ పథకం ద్వారా కాళేళ్వరం నుండి నీటిని అందించేందుకు సిఎం కెసిఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఆగస్టు 7వ తేదీన మిషన్ భగీరథ పథకం ద్వారా గజ్జేల్ నియోజకవర్గంలో ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించడం జరిగిందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంవత్సర కాలంలో ఇంటింటికి రక్షిత మంచినీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించగా, ఎమ్మెల్యే పాల్గొని విద్యార్థులను పలుకరిస్తూ హరితహారం కార్యక్రమం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భీమ్‌గల్ ఎంపిపి అధ్యక్షురాలు కొండ గోదావరి, జడ్పీటిసి లక్ష్మి శర్మనాయక్, ప్రత్యేక అధికారి రాజేశ్వర్, ఆర్మూర్ డిఎస్పీ రాంరెడ్డి, ఎంపిడిఓ గోవింద్‌నాయక్, తహశీల్దార్ బావయ్య, వైఎస్ ఎంపిపి శివసారి నర్సయ్య, భీమ్‌గల్ సర్పంచ్ రవినాయక్, ఉప సర్పంచ్ మల్లెల లక్ష్మన్, సొసైటీ చైర్మన్ చౌట్‌పల్లి రవి, కమ్మర్‌పల్లి ఎఎంసి చైర్మన్ దొన్కంటి నర్సయ్య, తెరాస నాయకులు గుణ్‌వీర్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.