నెల్లూరు

స్వచ్ఛ భారత్ మిషన్ వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలెక్టరేట్(నల్లగొండ), మార్చి 18: స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ మిషన్‌ల పనులను వేగవంతం చేసి పారిశుద్ధ్యం పరిరక్షణలో నూరుశాతం లక్ష్యాల సాధించాలని కేంద్ర ప్రభుత్వ పారిశుద్ధ్యం, తాగునీటి విభాగం సెక్రటరీ పరమేశ్వర్ అయ్యర్ కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన కలెకర్లు, జెసిలతో మాట్లాడుతు ఆక్టోబర్ రెండు గాంధీ జయంతి 2019నాటికి దేశంలో స్వచ్ఛ్భారత్ మిషన్ అమలు పూర్తి కావాలన్నారు. దేశంలోని 650జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా స్వచ్ఛ భారత్ పురోగతిని సమీక్షిస్తున్నామన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామ, మండల, జిల్లా స్థాయి ప్రణాళికలను అమలు చేయాలని అన్ని స్థాయిల్లో ఓడిఎఫ్‌గా ప్రకటించేలా కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ మాట్లాడుతు స్వచ్ఛ్భారత్, స్వచ్చ తెలంగాణ మిషన్ లక్ష్యాలపై ప్రజల్లో విస్తృత ప్రచార సాగించాలని, స్థానిక సంస్థలు పారిశుద్ధ్య చర్యలను సక్రమంగా అమలు చేయాలన్నారు. ఇంటింటికి మరుగుదొడ్డితో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలుతీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. జెసి ఎన్. సత్యనారాయణ మాట్లాడుతు జిల్లాలో ఐదు లక్షల గృహాలకుగాను 3లక్షల గృహాల్లో మరుగుదొడ్లు ఉన్నాయని మిగిలిన వాటిల్లో కూడా నిర్మాణాలను ప్రొత్సహిస్తున్నామన్నారు. గ్రామజ్యోతి కింద పారిశుద్ధ్య చర్యల లక్ష్యాల పూర్తికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటికే 29గ్రామాలను ఒడిఎఫ్ గ్రామాలుగా గుర్తించామన్నారు. 2016మే 10నాటి సూర్యాపేట నియోజకవర్గాన్ని ఓడిఎఫ్ నియోజకవర్గంగా ప్రకటించే చర్యలు చేపట్టామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏజెసి వెంకట్రావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ రమణ, డ్వామా పిడి దామోదర్‌రెడ్డి, డిఆర్‌డిఏ పిడి అంజయ్య, జడ్పీ సిఈవో మహేందర్‌రెడ్డి, డిపివో ప్రభాకర్‌రెడ్డిలు ఉన్నారు.