నిజామాబాద్

ఉద్యోగుల హాజరు పర్యవేక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జూలై 29: నిర్ణీత సమయానికి విధులకు హాజరై రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ హాజరు పర్యవేక్షణ సరిగా లేదని, అందువల్ల ఉద్యోగుల హాజరు పర్యవేక్షించాలని కలెక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించి వైద్యాధికారులు, సిబ్బంది హాజరు శాతాన్ని పరీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ యోగితారాణా మాట్లాడుతూ, బయోమెట్రిక్ ద్వారా నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది హాజరు శాతాన్ని సరిగా పర్యవేక్షణ చేస్తున్నట్లు కనిపించడం లేదన్నారు. చాలామంది ఉద్యోగులు ప్రతిరోజు గైర్హాజర్ అవుతున్నట్లు రిపోర్టును పరిశీలిస్తే తెలుస్తోందన్నారు. విధులకు గైర్హాజర్ అయిన సిబ్బందికి సరైన ఆదేశాలు జారీ చేయలేదని, పర్యవేక్షణ చేయడం లేదని, అలాంటప్పుడు ఎవరి కోసం దీనిని ఏర్పాటు చేసినట్లని ఆమె ప్రశ్నించారు. ఇకనుండైనా క్రమం తప్పకుండా హాజరును పరిశీలించాలని, విధులకు సక్రమంగా హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.