నిజామాబాద్

నేటి నుండి టెన్త్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రారంభం కానుండగా, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 39,105మంది విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా 206పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరిలో బాలురు 19418మంది ఉండగా, బాలికలు 19687మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతిరోజు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు కొనసాగనున్నాయి. ప్రతి పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌తో పాటు 11మంది ఇన్విజిలేటర్ల చొప్పున సిబ్బందిని నియమించారు. గతేడాది నుండి సిసిఇ విధానాన్ని అమల్లోకి తేగా, ఈసారి కొత్తగా పరీక్షా కేంద్రాల్లో సి.సి టివిలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమైంది. అయితే ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున సిసి కెమెరాలను సమకూర్చడంతో బాన్సువాడ మండలంలోని బోర్లం పాఠశాలలో నెలకొల్పిన ఎగ్జామినేషన్ సెంటర్‌లో మాత్రమే దీనిని ఏర్పాటు చేశారు. మిగతా సెంటర్లలో ఈ ఏడాదికి సంబంధించి సి.సి కెమెరాల ఏర్పాటు ప్రతిపాదనకే పరిమితమవడం పలువురికి ఊరటనందించింది. కాగా, కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, జె.సి రవీందర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఎస్సెస్సీ పరీక్షా ఏర్పాట్లపై పలు దఫాలుగా సమీక్షలు జరిపి, నిర్వహణాపరంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సెస్సీ పరీక్షల్లో జిల్లాలో ప్రతిఏటా మాస్ కాపీయింగ్ జోరుగా జరుగుతోందనే అపవాదును అధికార యంత్రాంగం మూటగట్టుకోవాల్సి వస్తోంది. వాస్తవంగానే జిల్లాకు చెందిన పలు ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అప్రతిహతంగా ర్యాంకుల వేటను కొనసాగిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లను మినహాయిస్తే నిజామాబాద్ జిల్లా 2008, 2009, 2010వ సంవత్సరాల్లో వరుసగా అత్యధిక ఉత్తీర్ణతను సాధించి రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌గా నిలిచి హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. అయితే 2011లో 16వ స్థానానికి, అనంతరం వరుసగా రెండేళ్లు 18వ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన మీదట గతేడాది జరిగిన పరీక్షల్లోనూ సగటు ఉత్తీర్ణత 82శాతానికే పరిమితమై రాష్ట్ర స్థాయిలో ఐదవ స్థానానికి పరిమితమైంది. అయినా కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు మాత్రం జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు దక్కాయి. ఈ పరిణామం కాపీయింగ్ ఆరోపణలు వెల్లువెత్తేలా చేస్తోంది. నగరంలోని సదరు ప్రైవేట్ విద్యా సంస్థ యాజమాన్యం ర్యాంకులను దక్కించుకుని, తద్వారా అడ్మిషన్లను పెంచుకోవాలనే ఆరాటంతో అడ్డదారులు తొక్కుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖకు చెందిన పలువురు అధికారులను అమ్యామ్యాలతో సంతృప్తిపరుస్తూ, తాయిలాల ఆశచూపి తమకు అనుకూలమైన వారిని సిఓలు, డిఓలు, ఇన్విజిలేటర్లుగా నియమించుకోవడంలో ఇప్పటికే సఫలీకృతమైనట్టు ప్రచారం జరుగుతోంది. కాగా, పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావు కల్పించినా సహించేది లేదని, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. పరీక్షలు కొనసాగుతున్న తీరును నిశితంగా పరిశీలించే బాధ్యతలను చేంజ్ ఏజెంట్లకు కట్టబెట్టారు. కలెక్టర్ హెచ్చరికలు ఏమేరకు ఫలిస్తాయన్నది వేచిచూడాల్సి ఉంది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా యంత్రాంగం భరోసా కల్పిస్తున్నప్పటికీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో మాత్రం ఆందోళన దూరం కాలేకపోతోంది. కాగా, పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్‌ను అమలు చేస్తూ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని డిఇఓ లింగయ్య తెలిపారు.

నిజాంసుగర్స్‌పై ఉద్ధృతం కానున్న ఉద్యమం
బోధన్, మార్చి 20: నిజాంసుగర్స్ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ వామపక్ష పార్టీలు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నాయి. అన్ని రాజకీయ పార్టీల మద్ధతుతో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో బాగంగా సోమవారం సిపిఐఎంఎల్ న్యూ డెమొక్రసీ, సిపిఎం, సిపిఐ, తెలంగాణ ప్రజాఫ్రంట్ అనుబంధ కార్మిక సంఘాలు ఐఎఫ్‌టియు, సిఐటియు, ఏఐటియుసి కార్మిక సంఘాల ప్రతినిధుల బృందం మెదక్, బోధన్ కర్మాగారాలను సందర్శించేందుకు రానున్నది. ఇక్కడ జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొని ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని కార్మికులకు సూచించనున్నట్లు సమాచారం. వంద రోజులుగా బోధన్‌లో తెలంగాణ ప్రజాఫ్రంట్, ఫ్యాక్టరీ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందె. దీనికి తోడు కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు అధికార పార్టీ మినహా ఇతర అన్ని రాజకీయ పార్టీలు సైతం మద్ధతును ప్రకటించాయి. గత కొన్ని రోజుల క్రితం అన్ని పార్టీలు కలిసి బోధన్ బంద్ కూడా నిర్వహించాయి. కానీ ప్రభుత్వం నుండి ఫ్యాక్టరీ స్వాధీనానికి సంబంధించి ఎటువంటి చర్యలు కనిపించక పోవడంతో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు యోచిస్తున్నారు. రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఉద్యమం చేసినట్లయితే ప్రభుత్వం త్వరిత గతిన స్పందించే అవకాశం ఉందన్న ఉద్దేశంతో వామపక్ష పార్టీల నాయకులు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇన్నాళ్లు కర్మాగారాన్ని నిర్వహించిన డెల్టా యాజమాన్యం కర్మాగారాలలో లే ఆఫ్ వేయడం వల్లనే సమస్య తీవ్రతరమయ్యిందని చెప్పవచ్చు.