నిజామాబాద్

ఆరువేల మందితో మల్లన్నసాగర్ సాధన సమితి సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, ఆగస్టు 5: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోనికి నీటిని తీసుకు వచ్చేందుకు సిఎం కెసిఆర్ భగీరథ ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్ట్ 12 వరద గేట్ల వద్దగల గుల్‌గస్తు గార్డెన్‌ను ఆయన పరిశీలించారు. అక్కడి నుంచి ప్రాజెక్ట్ 20 వరద గేట్ల ముందు బాగంలోస్థలాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి విలేఖరులతోమాట్లాడారు. ఈనెల 9వ తేదిన ప్రాజెక్ట్ 20 వరద గేట్ల ముందు బాగంలో 6వేల మందితోమల్లన్న సాగర్ సాధన సమితి సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టుకింద ఉన్న రైతులు స్వచ్చందంగా సదస్సుకు హాజరు కావాలన్నారు. కాళేశ్వరం నీటిని నిజాంసాగర్ లోనికి మళ్లించేందుకు సిఎం కెసిఆర్ 83వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారన్నారు. వీటిలో నుంచి 13వేల 500 కోట్ల రూపాయలకు సంబందించిన పనులకు టెండర్లు పిలిచారన్నారు. అన్నారం, మెనిగడ్డ, సుందెల, లిఫ్ట్‌ఇరిగేషన్ పనులు ప్రారంభమైయ్యాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జూన్, జులై మాసంలోసాదారణంగా వర్షం ఎక్కువగా నమోదైందన్నారు. ఈవర్షంతోఆరుతడి పంటలకు జీవం వచ్చినట్లైందన్నారు. భారీ వర్షాలు కురువక పోవడంతోనిజాంసాగర్ జలాశయంలోనికి నీరు రాక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు. మంజీరా నది ఎగువ ప్రాంతంలోగల మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని 47 ప్రాజెక్ట్‌లు నిర్మించడంతోసాగర్‌లోనికి నీరు రావడం లేదన్నారు. ఉత్తర తెలంగాణ కరువు బారి నుంచి రక్షించి, రైతులను ఆదుకునేందుకు సిఎం కెసిఆర్ చేస్తున్నప్రయత్నాన్ని ప్రతి పక్ష పార్టీలైన కాంగ్రెస్, టిడిపి, ఇతర పార్టీలు జీర్ణించుకోలేక తమ ఉనికిని కాపాడుకునేందుకు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏపార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించిన సిఎం కెసిఆర్ కాళేశ్వరం నీటిని నిజాంసాగర్‌లోకి రప్పించేందుకు ఎంతోప్రయత్నం చేస్తున్నారన్నారు. మెదక్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా లలోని 14 లక్షల ఎకరాలలోరైతులకు సాగునీటిని అందించేందుకు కాళేశ్వరం నుంచి రీడిజైన్ చేసి శాశ్వత పరిష్కారం చేస్తున్నారన్నారు. మల్లన్న సాగర్ 6 ముంపుగ్రామాల రైతులుప్రాజెక్ట్ నిర్మించుకునేందుకు సుముఖత తెలిపారని, వీరందరికిప్రభుత్వం నష్టపరిహారం అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. రైతులు ఒప్పుకున్నందుకు మంత్రి రైతులకు పాదాబివందనం చేశారు. ఈసమావేశంలోమంత్రివెంట జిల్లాపరిషత్ చైర్మైన్ దఫేదార్ రాజు, డిసిసిబి డైరెక్టర్ మోహన్‌రెడ్డి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు గైని విఠల్,ప్రమీల వెంకట్‌రాంరెడ్డి, నార్ల సురేష్, నాయకులు వినయ్‌కుమార్, గంగారెడ్డి, దుర్గరెడ్డి, అహ్మద్ హుసెన్ పాల్గొన్నారు.